Site icon Prime9

Foreign Drone: శ్రీకాకుళం సముద్ర తీరంలో విదేశీ డ్రోన్‌.. స్థానికుల్లో ఆందోళన

foreigh drone

foreigh drone

Foreign Drone: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని భావనపాడు సముద్ర తీరంలో విదేశీ డ్రోన్ జెట్ కలకలం రేపింది. మూలపేట, భావనపాడు మధ్య చేపల వేట సాగిస్తున్న మత్స్యకారులకు సముద్రంలో ఈ విదేశీ డ్రోన్ లభ్యమైంది. దీనిని గుర్తించిన మత్స్యకారులు బోటులో భావనపాడు తీరానికి చేర్చారు.

భావనపాడు సముద్ర తీరంలో ఈ డ్రోన్ జెట్ కలకలం రేపింది. చేపల వేటకు వెళ్లిన మత్య్సకారులు దీనిని గుర్తించి.. తీరానికి తీసుకొచ్చారు. వింతగా ఉండటంతో.. మెరైన్ పోలీసులకు సమాచారం అందించారు. దీనిని పరిశీలించిన పోలీసులు.. విదేశీ డ్రోన్ జెట్ గా గుర్తించారు.

దీనిని ఎవరు ప్రయోగించారు.. ఇక్కడకి ఎలా వచ్చింది అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

 

ఈ వస్తువు వింతగా ఉండటంతో.. దీనిని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన ఫోటలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు.

ఈ పరికరం కు సంబంధించి ఇంటర్ నెట్ లో ప్రజలు ఆరా తీస్తున్నారు. దీనిని పరిశీలించిన పోలీసులు.. దీని బరువు 111 కేజీలుగా ఉన్నట్లు గుర్తించారు.

వస్తువుపై 28.1.2023 తేదీ రాసి ఉంది. దీని ప్రకారం జనవరి 28న ఈ డ్రోన్ జెట్ ను ప్రయోగించినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.

ఇంకా దీనిపై పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు.

దీనిపై ఉన్న వివరాలతో పోల్చితే.. ఇది అమెరికాలో తయారై ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.

ఇది విదేశీ వైమానిక దళంలో శిక్షణ ఇచ్చేందుకు, డ్రోన్‌ Foreign Drone లా ఉపయోగించి టార్గెట్‌ సర్వే చేసేందుకు దీన్ని ఉపయోగిస్తారని చెప్తున్నారు.

గతంలో ఇదే మండలంలోని ఎం.సున్నాపల్లి తీరానికి విదేశీ మందిరం కొట్టుకొచ్చిన విషయం తెలిసిందే.

ఇలాంటి డ్రోన్ లను వాతావరణ శాఖ లేదా.. అంతరిక్ష పరిశోధనాల్లో ఇలాంటి డ్రోన్‌ లను వాడుతుంటారని సమాచారం.

ఇది ఎవరు ప్రయోగించారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
ఈ డ్రోన్‌పై ఈస్ట్‌ కోస్ట్‌ నావల్‌ అధికారులు సైతం దర్యాప్తు ప్రారంభించారు.

U19 Worldcup: ప్రపంచ కప్ గెలిచిన తెలుగు బిడ్డకు ఘన స్వాగతం | Cricketer Trisha Visuals @ HYD Airport

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version
Skip to toolbar