Site icon Prime9

AR Rahman Divorce: అందుకే రెహమాన్‌తో విడిపోతున్నా – విడాకులపై పెదవి విప్పిన సైరా బాను

AR Rahman Wife Comments on Divorce: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్ ఆయన భార్య సైరా బాను విడిపోతున్నట్టు ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. మూప్ఫై ఏళ్ల తమ వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ అనూహ్యాంగా వారి విడాకులు ప్రకటించారు. అప్పటి నుంచి ఏఆర్‌ రెహమాన్‌ను తప్పుబడుతూ తమిళ మీడియాలో, యూట్యూబ్‌ ఛానల్స్‌లో వార్తలు వస్తున్నాయి. దీనిపై తాజాగా ఆయన భార్య సైరా భాను స్పందించారు.

మొదట తన భర్త నుంచి విడిపోతున్నట్టు తన తరపు లాయర్‌తో ప్రకటన ఇచ్చిన ఆమె తాజాగా విడాకులకు అసలు కారణమేంటో తెలిపారు. ఈ సందర్భంగా రెహమాన్‌పై వస్తున్న తప్పుడు వార్తలను ఆమె ఖండించారు. “ప్రస్తుతం నేను ముంబైలో ఉన్నాను. అనారోగ్య సమస్యల కారణంగా చికిత్స కోసం ఇక్కడికి వచ్చాను. ఈ కారణం వల్లే నేను ఆయనతో విడిపోవాలని నిర్ణయించుకున్న. అంతేకాని మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఆయన చాలా మంచి వ్యక్తి. ఈ ప్రపంచంలో ఉన్న గొప్ప వ్యక్తుల్లో ఆయన ఒకరు.

అలాంటి ఆయనపై తప్పుడు వార్తలు ప్రచారం చేయడం చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఆయనకు సమాజంలో ఎంతో గౌరవం ఉంది. దయచేసి మీరు దానిని చెడగొట్టకండి. ఆయన అంటే నాకూ ఇప్పటికీ ఇష్టం. ఆయనకు కూడా నేనంటూ ఏనలేనిప్రేమ. కానీ, మా మధ్య నెలకొన్న భావోద్వేగపూరిత ఒత్తిడి కారణంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇకనైనా ఆయనను విమర్శించడం ఆపండి. విడాకుల ప్రకటన తర్వాత అంతా సైరా ఎక్కడికి వెళ్లిందని అంటున్నారు. ఇంకా మేము అధికారికంగా ఏం చెప్పలేదు. కాబట్టి ఈ క్లిష్ట పరిస్థితుల్లో మా గోప్యతను గౌరవిస్తారని ఆశిస్తున్నాను. ప్రస్తుతం నేను ముంబైలోరు ఉన్నాను. త్వరలోనే చెన్నైకి వస్తాను” అని ఆమె తెలిపారు.

Exit mobile version