Site icon Prime9

ఫేక్ బాబా : ఖమ్మంలో దొంగ స్వాములు… పూజ పేరుతో సర్వం స్వాహా.. చివరికి ఏమైందంటే?

fake-babas theft cash and gold from politician houe in khammam

fake-babas theft cash and gold from politician houe in khammam

Fake Baba : ఖమ్మం పట్టణంలో దొంగ బాబా విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రజల నమ్మకాలను ఆసరాగా చేసుకుంటూ కొంతమంది కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి ఘటనలను ఎన్నో చూశాం. అయితే తాజాగా రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఓ పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షుడు ఇంట్లో చోరీ చేసి ఉడాయించారు. ఆ తర్వాత సినిమాటిక్ స్టైల్లో వారిని చేస్ చేసి పోలీసులు పట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

దొంగ స్వాములు పట్టణంలో నివాసం ఉంటున్న ఓ పార్టీ నాయకుని ఇంటికి చేరుకున్నారు. నీకు రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉందని అందుకు… నీవు కొన్ని పూజలు చేస్తే కలిసి వస్తుందని నమ్మబలికారు. చివరకు పూజ చేయకుండానే అతని ఇంట్లో నుంచి 5 తులాల బంగారం, 35వేల నగదుతో పరారయ్యారు. దీంతో వెంటనే ఆ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు.

ఇక వెంటనే రంగంలోకి దిగిన ఖమ్మం టూ టౌన్ పోలీసులు… రెండు జిల్లాల పోలీసులకు సమాచారం ఇచ్చారు. కారులో పారిపోతున్న దొంగ స్వాములను కొత్తగూడెం వన్ టౌన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కాగా ఆ దొంగ స్వాములు రాజస్థాన్ కు చెందిన వారిగా గుర్తించారు. కారులో ఉన్న ఇద్దరు స్వాముల్లో ఒకరు పరారు కాగా మరో స్వామి, కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కారులో గంజాయి కూడా లభ్యమైనట్లు సమాచారం అందుతుంది. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు… వారిని విచారణ చేస్తున్నారు.

 

Exit mobile version