Site icon Prime9

CM KCR: మరగుజ్జులు మహాత్ములు కాలేరు….సీఎం కేసిఆర్

Dwarfs cannot be greats, CM KCR

Dwarfs cannot be greats, CM KCR

Gandhi Statue: హైదరాబాదు గాంధీ వైద్యశాల ప్రాంగంణంలో ఏర్పాటు చేసిన మహాత్మగాంధీ నూతన విగ్రహాన్ని సీఎం కేసిఆర్ అవిష్కరించారు. సమాజాన్ని చీల్చే వ్యక్తుల తీరుతో మహాత్ముని ప్రభ తగ్గదు, మరగుజ్జులు మహాత్ములు కాలేరంటూ ఆయన వ్యాఖ్యానించారు. మంత్రులు శ్రీనివాస యాదవ్, హరీష్ రావు నేతృత్వంలో గాంధీ వైద్యశాల ప్రాంగణంలో 16మీటర్ల ఎత్తులో ధ్యానముద్రలో ఉన్న మహాత్ముని విగ్రహాన్ని రూపుదిద్దారు. అక్టోబర్ 2 మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు.

దేశాన్ని, ప్రపంచాన్ని అతాకుతలం చేసిన నాటి కరోనా రోజుల్లో ప్రజలకు గాంధీ వైద్యశాల సిబ్బంది, వైద్యులు అందించిన సేవలు మరిచిపోలేమన్నారు. గాంధీ ప్రేరణలో జవహర్ లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, మౌలానా అబ్ధుల్ కలాం ఆజాద్ వంటి నాయకులు తయారైనారని పేర్కొన్నారు. 153 సంవత్సరాల చరిత్ర కల్గిన మహాత్ముడు పాటించిన సంస్కారానికి, సహనానికి, అహింసా సిద్ధాంతాలతో ప్రపంచ వ్యాప్తంగా తలెత్తుకొని నిలబడ్డారని ఆయన్ను కొనియాడారు. ఆయన స్పూర్తితో ఏర్పడిన స్వాతంత్య్రంలోనే మనందరం జీవిస్తున్నామని కేసిఆర్ తెలిపారు.

తెలంగాణ ఏర్పాటు ఉద్యమంలో నాటి తొలి రోజుల్లో నన్ను ఎగతాళి, అవహేళన చేసినవారు ఎందరో ఉన్నారన్నారు. ఆనాడు మహాత్ముని తలుచుకొని నేను ఉద్యమాన్ని ప్రారంభించానని చెప్పుకొచ్చారు. నేడు తెలంగాణ ప్రభుత్వం అహింసా బాటలో సాగుతూ పల్లె, పట్టణ ప్రగతితో దూసుకుపోతుందని పేర్కొన్నారు. అభివృద్ధిని సాధించాలంటే సమకాలిన పోకడలు, వైవిధ్యాలు ఆచరించాలని సూచించారు.

అదే విధంగా లాల్ బహుదూర్ శాస్త్రి జయంతిని కూడా సీఎం కేసిఆర్ ఈ సందర్భంగా గుర్తుచేసుకొన్నారు. గాంధీజీ బాటలొ నడిచిన ఆయన జై జవాన్, జై కిసాన్ అంటూ దేశానికి వారిని దగ్గరచేసిన మొట్టమొదటి వ్యక్తిగా కొనియాడారు. నేడు జై జవాన్ అగ్నిపధ్ లో నలిగిపోతున్నారని, జైకిసాన్, రైతుకు మద్ధతు ధర లేకుండా విలవిలలాడుతున్నారని కేంద్రం మాటెత్తకుండా పరోక్షంగా విమర్శించారు. దుర్మార్గపు ఆలోచనలతో ముందుకు సాగుతున్నారంటూ నేటి కేంద్ర ప్రభుత్వ విధానాలను సీఎం కేసిఆర్ తప్పుబట్టారు. చివరగా బాపూజీకి అంజలి ఘటించిన కేసిఆర్ జై తెలంగాణ, జై భారత్ అంటూ తన ప్రసంగం ముగించారు.

ఇది కూడా చదవండి: Gangula Kamalakar మాతో పెట్టుకోవద్దు.. వైసీపీ నేతలకు గంగుల కమలాకర్ వార్నింగ్

Exit mobile version