Site icon Prime9

Dulquer Salmaan : మరో తెలుగు సినిమాకి ఒకే చెప్పిన దుల్కర్ సల్మాన్.. డైరెక్టర్ ఎవరంటే ..?

dulquer slamaan going to act under venky atluri direction

dulquer slamaan going to act under venky atluri direction

Dulquer Salmaan : ప్రముఖ మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్అం.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. మమ్ముట్టి తనయుడుగా ఇండస్ట్రిలోకి వచ్చినప్పటికీ.. తనదైన శైలిలో పలు నిమాల్లో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆ సినిమాలు తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చెయ్యడం వల్ల తెలుగులో కూడా మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు. అయితే మహనటితో తెలుగు సినీ పరిశ్రమకు కూడా పరిచయం అయ్యాడు. ఇటీవలే సీతారామం సినిమాతో దుల్కర్ సల్మాన్ తెలుగు సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో దుల్కర్ కు విపరీతమైన అభిమానం దక్కింది.

దర్శకుడు హనూ రాఘవపూడి తెరకెక్కించిన ఆ చిత్రంలో దుల్కర్ సల్మాన్ హీరోగా చేయగా.. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఇక ఇప్పుడు మరోసారి తెలుగులో సినిమా చేయబోతున్నాడు దుల్కర్. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో కొత్త సినిమా అనౌన్స్ చేశాడు దుల్కర్. నేను దుల్కర్ సల్మాన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ తో పాటు ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. “లక్కీ భాస్కర్” అనే టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే వెంకీ ధనుష్ హీరోగా సార్ అనే సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఇక ఈ ప్రీ లుక్ లో వంద రూపాయల పాత నోటు వెనక నవ్వుతున్న హీరోను మనం చూడొచ్చు. ఈ సినిమాకు జీవి ప్రకాష్ సంగీతం అందించనుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. చడాలి మరి ఈ హైట్ కాంబో ఏం మ్యాజిక్ చేస్తారో అని..

 

 

Exit mobile version