Site icon Prime9

Lucky Bhaskar OTT: ఓటీటీకి ‘లక్కీ భాస్కర్‌’ – ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌!

Lucky Bhaskar OTT Release

Lucky Bhaskar OTT Release

Lucky Bhaskar OTT Release Date Confirm: మలయాళ స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్‌’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా విడుదలైన బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టడమే కాదు.. రూ. 100 కోట్ల పైగా గ్రాస్‌ కలెక్షన్స్ చేసింది. విడుదలైన దాదాపు నెల రోజులు అవుతున్న ఇప్పటి అక్కడక్కడ థియేటర్లో ఆడుతూనే ఉంది ఈ చిత్రం. ఓ సామాన్య బ్యాంక్‌ ఉద్యోగి రూ.100 కోట్ల అధిపతిగా ఎలా ఎదిగాడనేది కథ. 1990లో జరిగిన బ్యాంక్‌ స్కామ్‌ నేపథ్యంలో ఈ సినిమాను తీశారు. ఇక లక్కీ భాస్కర్‌ రిలీజై నెల రోజులు కావోస్తోంది.

దీంతో ఈ సినిమా డిజిటల్‌ ప్రిమియర్‌కి రెడీ అవుతోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ ఈ సినిమా డిజిటల్‌ రైట్స్‌ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకువచ్చేందుకు నెట్‌ఫ్లిక్స్‌ రెడీ అయ్యిందని తెలుస్తోంది. థియేట్రికల్‌ రిలీజ్‌ అనంతరం నెల రోజుల్లో ఓటీటీలో ఈ సినిమా రిలీజ్‌ చేయాలని నెట్‌ఫ్లిక్స్‌ ఒప్పందం కుదుర్చుకుందట. దీని ప్రకారం.. లక్కీ భాస్కర్‌ నవంబర్‌ 30 నుంచి స్ట్రీమింగ్‌ రానుంది. అయితే మూవీకి వస్తున్న రెస్పాన్స్ చూసి లక్కీ భాస్కర్‌ ఓటీటీ రిలీజ్ మరింత ఆలస్యం అవుతుందనే ప్రచారం జరిగింది. అయితే అందులో నిజం లేదని, నవంబర్‌ 30 ఓటీటీ రావడం కన్‌ఫాం అంటున్నాయి సినీవర్గాలు. అంతేకాదు త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా కూడా ప్రకటించనుందని అంటున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే ఆఫిషియల్‌ అనౌన్స్‌మెంట్స్‌ వచ్చేవరకు వేయిట్‌ చేయాల్సిందే.

Exit mobile version