Site icon Prime9

Dubbing Artist Srinivasa Murthy : టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి మృతి

dubbing-artist-srinivasa-murthy-passed away due to heart attack

dubbing-artist-srinivasa-murthy-passed away due to heart attack

Dubbing Artist Srinivasa Murthy : సినీ పరిశ్రమను విషాదం అలుముకుంది. ఈరోజు ఉదయాన్నే సీనియర్‌ నటి జమున కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్న సమయం లోనే మరోవైపు ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి మరణించిన వార్త మరింత విషాదాన్ని నింపింది. ఇవాళ ఉదయం 8.30 గంటలకు చెన్నైలో ఆయన ప్రాణాలు విడిచారని సమాచారం అందుతుంది.

సూర్య, అజిత్, విక్రమ్, మోహన్ లాల్, రాజశేఖర్ వంటి అనేక మంది ప్రముఖ దక్షిణ భారత నటులకు శ్రీనివాస మూర్తి తన గాత్రాన్ని అందించారు.

శ్రీనివాస మూర్తి తన కుటుంబంతో కలిసి చెన్నైలో నివసిస్తున్నాడు.

అయితే, ఇవాళ ఉదయం గుండెపోటుతో ఆయన మరణించడం బాధాకరం.

శ్రీనివాస్ మూర్తి తన స్వరంతో నటులు పోషించిన పాత్రలకు బలాన్ని జోడించారు.

అయితే, సినిమా పరిశ్రమలో ముఖ్యమైన భాగం అయినప్పటికీ, డబ్బింగ్ ఆర్టిస్టులు తెరవెనుక పని చేయడం వల్ల తరచుగా గుర్తించబడరు. ఇక, శ్రీనివాస మూర్తి స్వరం సూర్య పాత్రలతో చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంది, అతని సినిమాల్లో చూసినప్పుడు మరొక నటుడి వాయిస్ వినడానికి మొదట్లో ఇబ్బందిగా ఉంటుంది.

శ్రీనివాస మూర్తి వెయ్యికి పైగా సినిమాలకు డబ్బింగ్ చెప్పారు.

హాలీవుడ్ మరియు బాలీవుడ్ సినిమాలను దక్షిణాది ప్రాంతీయ భాషల్లోకి, ముఖ్యంగా తెలుగులోకి అనువదించబడిన సినిమాలకు డబ్బింగ్‌ చెప్పారు.

షారుఖ్ ఖాన్ మరియు సల్మాన్ ఖాన్ వంటి సూపర్ స్టార్‌లకు కూడా తన గాత్రాన్ని అందించాడు.

1998లో వచ్చిన శివయ్య సినిమాకి ఉత్తమ పురుష డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా నంది అవార్డుతో సహా పలు అవార్డులతో గుర్తింపు పొందారు.

ఈయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

ఒకే రోజు ఇద్దరు ప్రముఖుల మరణం..

కాగా ఈరోజునే నటి జమున కూడా మరణించారు. ఆమె వయసు 86 సంవత్సరాలు.. కాగా అనారోగ్య కారణాల వల్ల జమున మృతి చెందినట్లు భావిస్తున్నారు.

1936 ఆగస్ట్‌ 30న హంపీలో జమున జన్మించారు. ఆమె తల్లిదండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేశి.

జమున బాల్యమంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది.

ఆమె నటించిన తొలిచిత్రం పుట్టిల్లు.

రామారావు, అక్కినేని, జగ్గయ్య వంటి అలనాటి అగ్రహీరోల సరసన నాయికగా నటించింది.

మేటి తరం కథానాయికలలో అగ్ర తారల్లోజమున కూడా ఒకరు.

మహానటి సావిత్రితో పాటు పలు సినిమాల్లో జమున కలిసి నటించారు.

తన అందంతోనే కాకుండా, అభినయం, నృత్యాలతో ఆమె ప్రేక్షకులను అలరించారు.

జమున చిన్నతనం నుండే నాటకాలలో నటించేవారు. జమున తల్లి ఆమెకు శాస్త్రీయ సంగీతం, హార్మోనీయంలలో శిక్షణ ఇప్పించారు.

మా భూమి నాటకంలో జమున ఒక పాత్ర పోషించగా, ఆమె అభినయం నచ్చి ఆమెకు పుట్టిల్లు (1953)లో నటిగా అవకాశం ఇచ్చారు.

తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ సినిమాల్లో ఆమె నటించారు.

తెలుగు, దక్షిణభారత భాషల్లో కలిపి ఆమె 198 సినిమాలు చేశారు.

1967లో ఆమె హిందీలో నటించిన మిలన్ సినిమా.. 1964లో విడుదలైన మూగ మనసులు సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు లభించింది.

ఎన్ని పాత్రల్లో నటించినా ఆమెకు బాగా పేరు తెచ్చింది మాత్ర సత్యభామ క్యారెక్టరే. ఆ పాత్రలో ఆమెను తప్ప ఇంకెవరినీ ఊహించుకోలేమన్నట్టుగా జీవించారు జమున.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version