Site icon Prime9

Krishna Janmashtami: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అపశృతి.. మధురలో ఇద్దరు భక్తుల మృతి

Krishna Janmashtami: ఉత్తరప్రదేశ్‌లోని మధురలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భారీ రద్దీ కారణంగా ఊపిరాడక ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బాంకే బీహారీ ఆలయంలో అర్థరాత్రి వేడుకల సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా, భక్తుల సంఖ్య ఆకస్మాత్తుగా పెరిగింది. హారతి ఇచ్చే సమయంలో ప్రజలు కాంప్లెక్స్‌కు భారీగా చేరుకోవడంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. దీంతో ఊపిరాడక ఇద్దరు భక్తులు చనిపోయారు. ఓ పురుషుడు, స్త్రీ ఉన్నారని మధురలోని సీనియర్‌ పోలీసు అభిషేక్‌ యాదవ్‌ తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు కూడా గాయపడ్డారని చెప్పారు. వారికి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మధురలోని కృష్ణ జన్మభూమి ఆలయాన్ని సందర్శించారు.

ముంబై ఉట్టివేడుకల్లో 150 మందికి గాయాలు..

మరోవైపు ముంబైలో జ‌రిగిన ఉట్టి వేడుక‌ల్లో సుమారు 150 మంది గాయ‌ప‌డ్డారు. ద‌హి హండి వేడుక‌ల స‌మ‌యంలో మాన‌వ పిర‌మిడ్ నిర్మిస్తున్న సంద‌ర్భంలో గోవింద పాఠ‌కులు గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డ్డ 153 మందిలో 130 మందికి చికిత్స అందించామ‌ని, ఇంకా 23 మంది హాస్పిట‌ల్‌లో ఉన్న‌ట్లు బీఎంసీ అధికారులు తెలిపారు. థానేలో కూడా 64 మంది గోవింద పాఠ‌కులు గాయ‌ప‌డిన‌ట్లు అధికారులు తెలిపారు. ద‌హి హండీ వేడుక‌ల స‌మ‌యంలో వీళ్లంతా గాయ‌ప‌డ్డారు.

Exit mobile version