Actress Kasturi Shankar Absconding: ఇటీవల తెలుగు వాళ్లపై నటి కస్తూరి శంకర్ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో తెలిసిందే. నిరసన సమయంలో అల్లర్లను రెచ్చగోట్టేలా ఉండటంతో ఆమెపై పలు కేసులు నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం కస్తూరి పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే తన వ్యాఖ్యలపై ఇప్పటికే కస్తూరి క్షమాపణలు కూడా కోరింది. తెలుగు ప్రజలను కించపరిచే ఉద్దేశం లేదని, ఆ విధంగా తాను మాట్లాడలేదని వివరణ ఇచ్చింది. అంతేకాదు తన వ్యాఖ్యలను కూడా వెనక్కి తీసుకుంటున్నట్టు కూడా పేర్కొంది.
డిఎంకే నేతలు కావాలనే తన వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేస్తున్నారని వారిపై మండిపడింది. అయితే అప్పటికే కస్తూరిపై మధురై, చెన్నైలో పలు కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు కస్తూరికి నోటీసులు ఇచ్చేందుకు ఆఎమ ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉంది. ఆమె ఫోన్ కూడా స్వీచ్ఛాఫ్ వస్తుంది. దీంతో కస్తూరి పరారీ ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా ఇటీవల బ్రహ్మణులు తమకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ తమిళనాడులో నిరసన తెలిపారు.
అయితే కస్తూరి పీపుల్స్ పార్టీ ఆఫ్ తమిళనాడు తరపున వారికి మద్దతు తెలిపారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. రాజుల కాలంలో రాణులకు సేవలు చేయడానికి తమిళనాడుకు తెలుగువారు వచ్చారని, ఇప్పుడు వారే నిజమైన తమిళులమంటున్నారంది, అలా అయితే ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి తెలుగవారు ఎవరు? అని ప్రశ్నించింది. దీంతో ఆమె కామెంట్స్‌పై తమిళ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అంతేకాదు అప్పటికే నిరసనతో హీట్ మీద ఉన్న తమిళనాడులో అల్లర్లను మరింత రెచ్చగోట్టేలా ఆమె మాట్లాడటంతో పోలీసులు ఆమెపై కేసులు నమోదు చేశారు. అలాగే రాజకీయ నాయకులు, ప్రజలు సైతం చెన్నై, మధురరై ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్ ఫిర్యాదు చేశారు.