Site icon Prime9

Srikanth Odela: నాని-శ్రీకాంత్‌ ఓదేల టైటిల్‌ లీక్‌పై స్పందించిన డైరెక్టర్‌ – వారెవరో తెలుసంటూ మండిపడ్డ శ్రీకాంత్ ఓదెల

Director Srikanth Odela Fires On Title Leak: నేచురల్‌ స్టార్‌ నాని, కీర్తి సురేష్‌ హీరోహీరోయిన్లుగా వచ్చిన దసరా మూవీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. శ్రీకాంత్‌ ఓదేల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రూ. 100 క్షబ్‌లో చేరి రికార్డు సృష్టించింది. నాని కెరీర్‌ హయ్యేస్ట్‌ గ్రాస్‌ సాధించిన సినిమా కూడా ఇదే కావడం విశేషం. అయితే ఇప్పుడు ఈ హిట్‌ కాంబోలో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఓ క్రేజ్‌ ప్రాజెక్ట్‌ కోసం శ్రీకాంత్‌ ఓదెల, నాని మరోసారి జతకడుతుండటంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల దీనిపై అధికారిక ప్రకటన ఇచ్చారు.

అయితే ఇది దసరా సీక్వెల్‌ కాదని స్పష్టం కూడా చేశారు. దీంతో ఈసారి కాంబో వచ్చే చిత్రమేంటి, ఏ కథతో వస్తున్నారనేది క్యూరియాసిటీ నెలకొంది. అయితే ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ మూవీ టైటిల్‌ ఇటీవల బయటకు వచ్చింది. ఈ సినిమాకు ‘ది ప్యారడైజ్‌’ అనే టైటిల్‌ ఖరారు చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై మూవీ టీం మాత్రం అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఈ క్రమంలో తాజాగా తమ మూవీ టైటిల్‌ లీక్‌ అవ్వడంపై దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పనులకు పాల్పడుతుందేవరో తనకు తెలుసని, తన టీం మాత్రం ఈ పని చేయలేదని ఆయన పేర్కొన్నారు.

ఈ మధ్య ఏ సినిమాకైనా లీకుల బాధ ఎక్కువైంది. ముఖ్యంగా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్‌కి సంబంధించిన ఇలాంటి లీకులు ఎక్కువ అవుతున్నాయి. కానీ, ఈ విషయంలో అంతా అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌, రచయితలను అనుమానిస్తుంటారు. కానీ ఇది సరైనది కాదు. వారు రాబోయే తరం క్రియేషటర్స్‌. సినిమా రంగానికి వారు అందించే నిస్వార్థమైన సేవలను మనం గౌరవించాలి. అంతేగాని.. మూవీకి లీకులు రాగానే వారిని తప్పుబట్టడం మానుకోవాలి. కష్టపడి ఓ సినిమా పనిచేసేవారు ఇలాంటి పనులకు పాల్పడరు. ఇక నా సినిమా టైటిల్‌ని లీక్‌ చేసిందేవరో నాకు తెలుసు. వాళ్లు నా టీం సభ్యులు కాదు” అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా దసరా చిత్రంతోనే శ్రీకాంత్‌ ఓదెల ఇండస్ట్రీకి డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు. తొలి మూవీతోనే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ మాత్రమే కాదు ఏకంగా రూ. 100 గ్రాస్‌ మూవీని ఇండస్ట్రీకి అందించాడు. దీంతో అతడికి ఇండస్ట్రీలో డిమాండ్‌ పెరిగింది. దీంతో అతడి నెక్ట్స్‌ ఏ హీరోని డైరెక్ట్‌ చేస్తాడా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో మరోసారి నానితోనే అని చెప్పి అందరిని సర్‌ప్రైజ్‌ చేశాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఇటీవల సెట్స్‌పైకి తీసుకువచ్చాడు. ఈ క్రమంలో సినిమాకు ది ప్యారడైజ్‌ అనే టైటిల్‌ మూవీ టీం అనుకుంటూ ఉండగానే.. ఎవరో లీక్‌ చేసేశారు. దీంతో మూవీ టీం దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుంది.

Exit mobile version