Director K viswanath : “శంకరాభరణం”@43 ఇయర్స్.. సరిగ్గా రిలీజ్ నాడే తుదిశ్వాస విడిచిన కె. విశ్వనాథ్

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.లెజెండరీ దర్శకుడు, కళాతపస్వి కె. విశ్వనాథ్ తుదిశ్వాస విడిచారు.ప్రస్తుతం ఆయన వయస్సు 92 సంవత్సరాలు. కాగా గురువారం రాత్రి(ఫిబ్రవరి 2) ఆయన శివైక్యం చెందారు.

  • Written By:
  • Publish Date - February 3, 2023 / 07:28 AM IST

Director K viswanath : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

లెజెండరీ దర్శకుడు, కళాతపస్వి కె. విశ్వనాథ్ తుదిశ్వాస విడిచారు.

ప్రస్తుతం ఆయన వయస్సు 92 సంవత్సరాలు.

కాగా గురువారం రాత్రి(ఫిబ్రవరి 2) ఆయన శివైక్యం చెందారు.

గత కొన్ని రోజులుగా వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రి చేరారు. ఆ క్రమంలోనే చికిత్స పొందుతూ గురువారం రాత్రి చనిపోయినట్లు తెలుస్తుంది.

విశ్వనాథ్ మరణ వార్త తెలిసి పలువురు సినీ, రాజకీయ, ఇతర రంగాలలోని ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

 

కళాతపస్వి విశ్వనాథ్ కెరీర్ లో స్పెషల్ మూవీ శంకరాభరణం..

అయితే భారతీయ సినీపరిశ్రమలో టాలీవుడ్ పేరు వినబడేలా చేసిన దర్శకుల్లో కె విశ్వనాథ్ ప్రముఖులు.

భారతీయ సంస్కృతికి చిహ్నమైన శాస్త్రీయ కళలను తన కథలుగా మలుచుకొని, అద్భుతమైన చిత్ర కావ్యాలను తెరకెక్కించి.. కళాతపస్వి అనిపించుకున్నారు దర్శకుడు కాశీనాథుని విశ్వనాథ్.

విశ్వనాథ్ దర్శకత్వం వహించిన అద్భుతమైన సినిమాల్లో, భారతీయ చలనచిత్ర ఆణిముత్యాల్లో ‘శంకరాభరణం’ కూడా ఒకటి.

ఈ సినిమాకు ఉత్తమ సినిమాగా నంది అవార్డు రావడమే కాక.. జాతీయ అవార్డు కూడా అభించింది.

‘బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ఫర్ ప్రోవైడింగ్ హోల్ సమ్ ఎంటర్టైన్మెంట్’ విభాగంలో నేషనల్ అవార్డు అందుకుంది ఈ చిత్రం.

శంకరాభరణం 1981లో ఫ్రాన్స్‌లో జరిగిన చలన చిత్రోత్సవంలో ప్రేక్షకుల ప్రత్యేక అవార్డును కూడా అందుకుంది.

ఆయన దర్శకత్వంలో వచ్చిన, తెలుగు చలనచిత్ర ఆణిముత్యాల్లో ఒకటైన ‘శంకరాభరణం (1980)’ విడుదలైన రోజునే (ఫిబ్రవరి 2) ఆయన కూడా మరణించడం దైవికం అనే చెప్పాలి.

శంకరాభరణం రిలీజ్ అయ్యి 43 సంవత్సరాలు అవుతుంది.

 

 

పాశ్చాత్య సంగీతం ప్రభావంతో సత్సంప్రదాయ సంగీతానికి గుర్తింపు తగ్గిపోతున్న రోజుల్లో.. ఈ అద్భుతమైన దృశ్య పరంపర దాన్ని కాపాడింది.

అందుకే ఈ చిత్రం జాతీయ అవార్డును గెలుచుకోవడమే కాదు.. తెలుగు సినీ అభిమానులు గర్వంగా చెప్పుకోగలిగే ఓ గొప్ప చిత్రంగా నిలిచిపోయింది.

మొదట కొన్ని కేంద్రాలలో కేవలం ఉదయం ఆటలతోనే ప్రదర్శితమైన ‘శంకరాభరణం’ తరువాత రెగ్యులర్ షోస్ తో శతదినోత్సవాలు, రజతోత్సవాలు జరుపుకుంది.

తమిళనాడు, కేరళలలోనూ ‘శంకరాభరణం’ ఘనవిజయం సాధించింది.

అంతటి చరిత్రను.. విశ్వనాథ్ ను కళాతపస్విగా నిలిపిన ‘శంకరాభరణం’ విడుదలైన ఫిబ్రవరి 2వ తేదీనే ఆయన కూడా తనువు చాలించడం దైవికం అనే చెప్పాలి.

ప్రస్తుతం ఆయన మృతితో టాలీవుడ్ లో విషాదఛాయలు అలుముకున్నాయి.

 

కళాతపస్వి విశ్వానాథ్ స్వస్థలం గుంటూరు జిల్లాలోని రేపల్లె.

1930 ఫిబ్రవరి 19న ఆయన పుట్టిన రోజు

గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్‌ కంప్లీట్‌ చేశారు. ఆంధ్రా యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేసి, ఆ తర్వాత వాహిని స్టూడియోస్‌లో సౌండ్‌ ఆర్టిస్టుగా తన సినీ కెరీర్‌ను మొదలుపెట్టారు.

1965లో అక్కినేని నాగేశ్వరావు కథానాయకుడిగా నటించిన ఆత్మ గౌరవం సినిమాతో దర్శకుడిగా వచ్చిన కె.విశ్వనాథ్‌ ఎన్నో అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు.

సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సప్తపది, సాగరసంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, శ్రుతిలయలు, స్వయంకృషి, స్వర్ణకమలం, సూత్రధారులు, స్వాతికిరణం వంటి ఎన్నో క్లాసికల్‌ చిత్రాలను ఆయన తెలుగు ప్రేక్షకులకు అందించారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/