Dil Raju : ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు గురించి అందరికీ బాగా తెలిసిందే.
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ ల జాబితాలో ఈయన కూడా ఉన్నాడు.
అయితే దిల్ రాజు మొదటిగా డిస్ట్రిబ్యూటర్ గా తన కెరీర్ ను ప్రారంభించాడు.
అలా ప్రారంభించిన అతను ఎన్నో మంచి చిత్రాలను సినీ ఇండస్ట్రీకి అందించాడు.
ఈ క్రమంలో స్టార్ ప్రొడ్యూసర్ గా మారాడు. అంతేకాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా సినిమాలను నిర్మిస్తూ.. భారీ బడ్జెట్ తో సినీ ఇండస్ట్రీకి మంచి సినిమాలను అందిస్తున్నాడు.
తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఈయన వ్యక్తిగత విషయానికొస్తే.. 2017 లో దిల్ రాజు మొదటి భార్య గుండెపోటుతో మరణించారు.
రెండో వివాహం..
దీంతో కొంతకాలం ఒంటరిగా ఉన్న దిల్ రాజు (Dil Raju).. 2020 లో తేజస్విని అనే అమ్మాయితో రెండో వివాహం చేసుకున్నాడు.
అయితే ఆ అమ్మాయి దిల్ రాజు కంటే చాలా చిన్న వయస్సు గలది.
రెండో పెళ్లితో అతను ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాడు.
తన వయసులో సగం వయస్సు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని అతనిపై ఎన్నో విమర్శలు నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి.
ఇక ఇటీవలే వీరికి ఒక మగ బిడ్డ కూడా జన్మించాడు.
అయితే తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన వ్యక్తిగత జీవితం గురించి దిల్ రాజు ఓపెన్ అయ్యారు.
ఈ ఇంటర్వ్యూలో దిల్ రాజుతో పాటు తేజస్విని కూడా పాల్గొనడం విశేషం.
ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారంటే..
దిల్‌రాజు తేజస్విని ఎలా కలిశారన్న విషయాలను తెలుపుతూ.. ‘నా మొదటి భార్య అనిత మరణించిన తర్వాత రెండేళ్లు చాలా కష్టాన్ని అనుభవించాను.
నాకు అప్పుడు 47 ఏళ్లు ఉన్నాయి. జీవితంలో మళ్లీ ముందుకు వెళ్లాలి అనుకుంటున్న సమయంలో రెండు, మూడు ఆప్షన్స్ ఉన్నాయి.
కానీ నా బిజీ లైఫ్ కారణంగా నన్ను అర్థం చేసుకునే వ్యక్తి కావాలనుకున్నాను. అదే సమయంలో నేను విమానంలో ప్రయాణం చేసే సమయంలో తెజస్విని పరిచయం అయ్యింది.
ఫోన్ నెంబర్ తీసుకొని దాదాపు ఏడాది పాటు ఆమెను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను.
ఆ జర్నీ తర్వాత నేను ప్రపోజ్ చేయడం, ఆ తర్వాత ఫ్యామిలీతో చర్చలు జరిపి చివరికి వివాహం చేసుకున్నాం అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.
అలానే తేజస్వినిలో గ్రౌండ్ టు ఎర్త్ ఉండే స్వభావమే తనకు బాగా నచ్చింది అని తెలిపారు.
అదే విధంగా తేజస్విని మాట్లాడుతూ.. నేను ఎయిర్ లైన్స్‌లో పనిచేస్తున్న సమయంలో, ఈయన రెగ్యులర్‌గా ట్రావెల్ చేసేవారు.
మొదటిసారి నన్ను కలిసినప్పుడు పెన్ అడిగారు. నేను షిఫ్ట్‌లో ఉన్న ప్రతీసారి విమానంలో కనిపించేవారు.. అలా మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం వీరు మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/