Site icon Prime9

Dhanush: ధనుష్‌ ఇడ్లికడై సరికొత్త పోస్టర్‌తో క్రేజీ అప్‌డేట్‌ – రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన హీరో, ఎప్పుడంటే!

Dhanush Idli Kadai Locks Release Date: తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ ఇటీవల రాయన్‌తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టాడు. ఈ సినిమాకు ధనుష్‌ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. హీరోగా, డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నాడు. దీంతో అదే జోష్‌ ధనుస్‌ వరుస ప్రాజెక్ట్స్‌ని లైన్లో పెట్టాడు. ప్రస్తుతం అతడి చేతిలో పలు ప్రాజెక్ట్స్‌ ఉండగా.. అందులో ఇడ్లికడై చిత్రం ఒకటి. సైలెంట్‌గా షూటింగ్ ప్రారంభించాడు ధనుష్‌. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చాడు.

తాజాగా మూవీ రిలీజ్‌ డేట్‌ ప్రకటించి సర్‌ప్రైజ్‌ చేశాడు. కాగా ఈ సినిమాను DD4 అనే వర్కింగ్‌ టైటిల్‌తో సెట్స్‌పైకి తీసుకువచ్చారు. సైలెంట్‌గా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి పెద్దగా అప్‌డేట్స్‌ ఏం ఇవ్వడం లేదు. ఇటీవల ఈ సినిమాకు ఇడ్లికడై టైటిల్‌ని ఫిక్స్‌ చేసి అప్‌డేట్‌ ఇచ్చారు. సరికొత్తగా టైటిల్‌తో వస్తున్న ఈ మూవీ కథేంటి, ధనుష్‌ ఈసారి ఏ స్టోరీతో రాబోతున్నాడనేది అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో సైలెంట్‌గా ఈ సినిమా నుంచి క్రేజ్‌ అప్‌డేట్‌ వదిలాడు ధనుష్‌. తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ విడుదల చేశాడు.

ఇందులో ధనుష్‌… తాటాకులతో ఉన్న ఓ చిన్న ఇంటివైపు నడుచుకుంటూ వెళుతూ కనిపించాడు. అయితే ధనుష్‌ లుక్ కనిపించకుండ బ్యాక్‌ నుంచి విడుదల చేస్తూ సినిమాను 2025 ఏప్రిల్‌ 10న వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ బాగా ఆకట్టుకుంటోంది. ఇందులో ధనుష్‌ లుక్‌, ఆ చిన్న ఇల్లు మూవీపై ఆసక్తిని పెంచుతుంది. కాగా ఈ సినిమాలో ధనుష్‌ సరసన నిత్యామీనన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాహుబలి కట్టప్ప సత్యరాజ్‌, అరుణ్‌ విజయ్‌, అశోక్‌ సెల్వన్‌, రాజ్‌ కిరణ్‌లు కీలక పాత్రలు పోస్తున్నారు. ఆకాశ్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాశ్‌ మ్యూజిక్‌, బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నాడు.

Exit mobile version