Site icon Prime9

Dhanush-Aishwarya Divorce: ఫస్ట్‌టైం కోర్టు విచారణకు హాజరైన ధనుష్‌,ఐశ్వర్య – విడాకులపై ఏమన్నారంటే!

Dhanush and Aishwaryaa Rajinikanth Divorce: తమిళ స్టార్‌ హీరో ధనుష్‌, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కూతురు, డైరెక్టర్‌ ఐశ్వర్య రజనీకాంత్‌ రెండేళ్ల క్రితం విడాకుల ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. తమకు విడాకులు కావాలంటూ చెన్నై ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకోగా వారి పటిషన్‌పై బుధవారం కోర్టు విచారణ జరిపింది. ఇందుకోసం తొలిసారి ధనుస్‌, ఐశ్వర్యలు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోర్టు విడిపోవడానికి కారణాలను ఏంటని వారిని ప్రశ్నించగా.. వారు కోర్టుకు వివరణ ఇచ్చుకున్నట్టు సమాచారం.

అంతేకాదు తాము కలిసి ఉండాలనుకోవడం లేదని, అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు వారు కోర్టుకు తెలిపారు. దీంతో ఇరువురికి వాదనలు విన్న ఫ్యామిలీ కోర్టు తుది విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఆ రోజున వీరికి విడాకులు మంజూరు చేస్తూ తీర్పు వెలువరించనుంది కోర్టు. దీంతో మరోసారి ధనుష్‌, ఐశ్వర్యల విడాకులు వ్యవహరం మరోసారి వార్తల్లో నిలిచింది. ఇది తెలిసి వారి ఫ్యాన్స్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని మరిచిపోయి వీరిద్దరు కలిసిపోతే బాగుండు అని కోరుకుంటున్నారు. కాగా ధనుష్‌-ఐశ్వర్యలు 2022 జవనరిలో విడాకుల ప్రకటన ఇచ్చి అందరికి షాక్‌ ఇచ్చారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటన ఇచ్చారు.

‘ఎన్నో ఏళ్ల పాటు స్నేహితులుగా, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా ఒకరినినొకరం అర్థం చేసుకొని మా ప్రయాణం కొనసాగించాం. కానీ, ఇకపై మేము వేరువేరుగా ప్రయాణించాలని నిర్ణయించుకున్నాం’ అంటూ తమ 18 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. ఆ తర్వాత విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టులో విడాకులు పటిషన్‌ వేయగా.. రెండేళ్ల తర్వాత దీనిపై కోర్టు విచారణ జరిపింది. ఈ క్రమంలో వారిద్దరిని కలిపేందుకు కుటుంబ సభ్యులతో పాటు కోర్టు కూడా విశ్వ ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. ఇరువురికి ఎన్నోసార్లు కౌన్సిలింగ్‌ ఇచ్చిన ధనుష్‌,ఐశ్వర్యలు విడిపోవాలనే గట్టిగా నిర్ణయించుకున్నారు.

ఇదే విషయాన్ని నిన్న తుది విచారణలోనూ స్పష్టం చేయడంతో త్వరలోనే అధికారికంగా వారికి విడాకులు మంజూరు కానున్నాయి. కాగా 2003 నవంబర్‌ 18న ధనుష్‌-ఐశ్వర్యల వివాహం జరిగింది. వీరికి యాత్రం, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్యభర్తలుగా విడిపోయిన తల్లిదండ్రులుగా మాత్రం ఈ మాజీ దంపతులు విడివిడిగా తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. తమ కుమారులకు సంబంధించిన విషయాలలో ఇద్దరు పాలుపంచుకుంటున్నారు. ఇద్దరు జంటగా పాఠశాల కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం వారి పిల్లలు ఐశ్వర్య దగ్గర ఉంటున్నా.. అప్పుడప్పుడు తండ్రి ధనుష్‌తో సమయం గడుపుతున్నారు.

Exit mobile version