Taraka Ratna Melena Disease : తారకరత్న చిత్తూరు జిల్లా కుప్పంలో ‘యువగళం’ పాదయాత్ర సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.
బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
అయితే తారకరత్న అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు అక్కడి వైద్యులు వెల్లడించారు.
మెలెనా అనే అరుదైన వ్యాధితో తారకరత్న బాధపడుతున్నారని వైద్య బృందం ప్రకటించింది.
కాగా జీర్ణశయాంతర (గ్యాస్ట్రో ఇంటెస్టినల్) రక్తస్రావాన్ని మెలెనాగా పేర్కొంటారు.
ఈ తరుణంలోనే మామూలుగా మెలెనా వ్యాధి రావడానికి గల కారణాలు.. వ్యాధి లక్షణాలు.. చికిత్స కు సంబంధించిన వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
ఎగువ జీర్ణశయాంతర మార్గం దెబ్బ తినడం
కడుపులో పుండ్లు, కడుపులో యాసిడ్ ఉత్పత్తి అధికంగా ఉండడం
రక్తనాళాల్లో వాపు, రక్తస్రావం, రక్త సంబంధిత వ్యాధుల వల్ల మెలెనా వస్తుంది.
మెలెనా వ్యాధి సోకితే.. మలం నల్లగా, బంక మాదిరి వస్తుంది. దుర్వాసన విపరీతంగా వస్తుంది.
ఈ వ్యాధి వల్ల శరీరంలో రక్త స్థాయి తగ్గిపోతుంది. రక్తహీనతతో పాటు బలహీనమైపోతారు.
కొన్ని సార్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది.
శరీరం లేత రంగులోకి మారిపోతుంది.
అలసట, విపరీతమైన చెమటలు, గందరగోళం అనిపించడం, అకస్మాత్తుగా కుప్పకూలిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటివి జరుగుతాయి.
నోరు, అన్నవాహిక, కడుపు, చిన్న ప్రేగు మొదటి భాగం నుంచి రక్తస్రావం సంభవిస్తుంది.
కొన్నిసార్లు ఎగువ జీర్ణశయాంతర దిగువ భాగంలో ఉండే పెద్ద ప్రేగు ఆరోహణ భాగంలో కూడా రక్తస్రావం జరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
మెలెనా వ్యాధి సోకిన వారికి పెప్టిక్ అల్సర్ ట్రీట్మెంట్ తో పాటు ఎండోస్కోపీ థెరపీ, సర్జికల్ థెరపీ, ఆంజియోగ్రాఫిక్ ఎంబలైజేషన్, రక్తమార్పిడి చికిత్సలు చేస్తారు.
అయితే మెలెనా వల్ల కొన్ని సందర్భాల్లో రక్తస్రావం విపరీతంగా అవుతుంది. ముక్కు,చెవులు, నోరు సహా పలు చోట్ల నుంచి రక్తస్రావం జరుగుతుంది.
కొన్ని సందర్భాల్లో తీవ్రమైన గుండెపోటు తర్వాత.. రక్తనాళాల్లో రక్తస్రావం అవుతుంది.
అలాంటప్పుడు గుండెకు చికిత్స చేయడంలో సవాళ్లు ఎదురవుతుంటాయి.
అందుకోసం కృత్రిమ గుండె కదలిక కోసం ఎక్మో మెషిన్ ఇంప్లాంటేషన్ చేస్తారు.
ఇక రక్తపోటు కూడా మెలెనా స్థితిని తగ్గిస్తుంది.
అందుకే రక్తపోటు సమతుల్యత కోసం ప్రత్యేక మిషన్ అప్లికేషన్ ఉపయోగించి చికిత్స అందిస్తారు.
కాగా తారకరత్నకు కూడా ఈ విధంగానే చికిత్స చేస్తున్నట్లు తెలుస్తోంది.
తారక్ గుండె నాళాల్లోకి రక్తప్రసరణ కష్టంగా అవుతుండడంతో.. బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా గుండె నాళాల్లోకి రక్తాన్ని పంపిణీ చేసేందుకు వైద్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటికే బాలకృష్ణ, వసుంధర, బ్రాహ్మణి, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, కళ్యాణ్ రామ్, సుహాసిని, దగ్గుబాటి పురంధేశ్వరి, టీడీపీ నాయకులు ఆసుపత్రికి చేరుకొని తారకరత్న ఆరోగ్యం గురించి వైద్యులతో మాట్లాడారు.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/