Monkeypox Case: ఢిల్లీలో ఐదవ మంకీ పాక్స్‌ కేసు

ఢిల్లీలో ఐదవ మంకీ పాక్స్‌ కేసు నమోదు అయ్యింది. ఆఫ్రికా జాతికి చెందిన 22 ఏళ్ల యువతికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలిందని లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ హాస్పిటల్‌ మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సురేష్‌కుమార్‌ తెలిపారు.

  • Written By:
  • Publish Date - August 13, 2022 / 07:27 PM IST

Delhi: ఢిల్లీలో ఐదవ మంకీ పాక్స్‌ కేసు నమోదు అయ్యింది. ఆఫ్రికా జాతికి చెందిన 22 ఏళ్ల యువతికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలిందని లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ హాస్పిటల్‌ మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సురేష్‌కుమార్‌ తెలిపారు. ఇటీవలే ఆమె ఆఫ్రికా పర్యటనకు వెళ్లి వచ్చారు. గత వారం నాలుగవ కేసు నమోదైంది. నైజీరియాకు చెందిన మహిళకు కూడా పాజిటివ్‌గా తేలింది. కాగా దేశం మొత్తానికి చూస్తే మంకీపాక్స్‌లు బయటపడ్డాయి. కేరళలో మంకీపాక్స్‌తో ఒకరు మృతి చెందారు.

ప్రపంచవ్యాప్తంగా చూస్తే అమెరికాతో పాటు యూరోప్‌లోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది 31వేల కేసులు నమోదయ్యాయి. అమెరికాలోనే 11వేల కేసులు వెలుగుచూశాయి. కాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్‌షుక్‌ మాండవీయా కూడా పార్లమెంటులో మంకీపాక్స్‌ స్పందించారు. ఇదేమంత ప్రమాదకారి కాదని చెప్పారు.