Prime9

Hijab Protests In Iran: ఇరాన్‌లో మిన్నంటిన నిరసనలు.. 50 మంది మృతి

Hijab Protests In Iran: ఇరాన్‌లో నిరసన జ్వాలలు మిన్నంటుతున్నాయి. హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలు రోజురోజు తీవ్రరూపం దాల్చుతున్నాయి. వరుసగా ఎనిమిదో రోజూ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలతో రోడ్డెక్కారు. క్రమంగా ఈ నిరసనలు దేశంలోని 80 పట్టణాలు, నగరాలకు విస్తరించాయి.

అయితే వీటిని అణచివేసేందుకు పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు మోహరించాయి. టియర్‌ గ్యాస్‌, పెప్పర్‌ స్ప్రేలను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు కనీసం 50 మంది దేశపౌరులు మరణించారని ఓస్లో కేంద్రంగా పనిచేస్తున్న ఇరాన్‌ మానవ హక్కుల సంస్థ వెల్లడించింది. అయితే ప్రభుత్వం 17 మంది మాత్రమే చనిపోయారి చెబుతుందని కానీ వాస్తవిక సంఖ్య వేరే అని పేర్కొనింది. మృతులలో ఐదుగురు భద్రతా సిబ్బంది కూడా ఉన్నారని తెలిపింది.

ఇటీవల కాలంలో హిజాబ్‌ ధరించలేదన్న కారణంతో మాసా అమీని అనే 22 ఏళ్ల యువతిని టెహ్రాన్‌ పోలీసులు అరెస్టు చేసి తీవ్రంగా గాయపరిచారు. కాగా ఆమె చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఇరాన్ పోలీసుల తీరును తప్పుపడుతూ పలువురు ఆ దేశ మహిళలు రోడ్డెక్కి నిరసన చేపట్టారు.

ఇదీ చదవండి: Hijab: ఇరాన్‌లో హిజాబ్ పై మిన్నంటిన నిరసనలు.. 31 మంది మృతి

Exit mobile version
Skip to toolbar