Danam Nagendar: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ టికెట్ విషయంపై వివరణ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కూడా టికెట్ తనకే వస్తుందని అన్నారు. ఈ విషయం కేసీఆరు కు కూడా తెలుసని అన్నారు.
పుకార్లు నమ్మకండి..
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ టికెట్ విషయంపై వివరణ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కూడా టికెట్ తనకే వస్తుందని అన్నారు. ఈ విషయం కేసీఆరు కు కూడా తెలుసని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో మరోసారి ఖైరతాబాద్ నుంచే పోటీ చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మవద్దని సూచించారు. నియోజకవర్గంలోని పలు కాలనీల్లో పర్యటించిన ఆయన.. బీఆర్ఎస్ అభ్యర్థిని తానేనని ప్రకటించుకున్నారు. ఈ విషయం సీఎం కేసీఆర్‌కు కూడా తెలుసునని అన్నారు.
కొందరు కావాలనే తనపై విషప్రచారం చేస్తున్నారని అన్నారు. పనికిరాని యూట్యూట్ ఛానెళ్లతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అలాంటివాటిని నమ్మాల్సిన అవసరం లేదని అన్నారు. దానం నాగేందర్ చాలాకాలం పాటు కాంగ్రెస్ లో కొనసాగారు. 2018 ఎన్నికల ముందు బీఆర్ ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థిగా నిలిచిన దాసోజ్ శ్రవణ్ కాంగ్రెస్ లో ఉన్నారు. ప్రస్తుతం దాసోజు శ్రవణ్ కూడా బీఆర్ఎస్ లోనే ఉన్నారు.
రానున్న ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ టికెట్ శ్రవణ్‌కు వస్తుందంటూ గత కొంత కాలంగా ప్రచారం జరగుతోంది. ఈ నేపథ్యంలోనే దానం నాగేందర్ ఇవాళ కీలక కామెంట్స్ చేశారు. మరి పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.