Site icon Prime9

Tirumala Tirupati Devasthanam: టీటీడీకి షాక్.. భక్తుడికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలన్న వినియోగదారుల కోర్టు

ttd to release senior citizens and phc quota free tickets

ttd to release senior citizens and phc quota free tickets

Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఎపుడూ లేనివిధంగా ఒక భక్తుడు సేవలందించడంలో జాప్యం జరుగుతోందంటూ వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. దీనితో కోర్టు అతనికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది.

తమిళనాడుకు చెందిన కె.ఆర్.హరి భాస్కర్ అనే భక్తుడు 14 ఏళ్ల క్రితం వస్త్రాలంకార సేవ కోసం బుకింగ్ చేసుకున్నారు. కాని అప్పటి నుంచి ఆయనకు స్లాట్ దొరకలేదు. ఇటీవల కరోనా కాలంలో తిరుపతి దేవస్థానం 80 రోజుల పాటు మూసివేయబడింది. అందువల్ల ఆలయంలో అన్ని సేవలను మూసివేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) విఐపి బ్రేక్ దర్శనం కోసం కొత్త స్లాట్ కావాలా లేదా వాపసు కావాలా అని భక్త హరి భాస్కర్‌కు అధికారిక ప్రకటన పంపింది. దీనిపై భాస్కర్ ఆలయానికి వస్త్రాలంకార సేవకు తేదీని బుక్ చేయాలని కోరారు. అయితే ఆ తర్వాత వస్త్రాలంకార సేవకు కొత్త తేదీని ఇవ్వలేమని చెప్పడంతో దేవస్థానం వాపసు ఇవ్వాలని కోరింది. దీనితో హరి భాస్కర్ వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. భక్తునికి అనుకూలంగా తీర్పునిచ్చిన కోర్టు, భక్తుడికి వస్త్రాలంకార సేవకు కొత్త తేదీని ఇవ్వాలని లేదా సంవత్సరానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని తిరుపతి దేవస్థానాన్ని ఆదేశించింది

వస్త్రాలంకార సేవ..
ప్రతి శుక్రవారం ఉదయం మూల విరాట్‌కు చేసే ఆగమాలలో ఇది అత్యంత పవిత్రమైన ఆచారం. ముందుగా టి.టి.డి డెయిరీ నుండి తెచ్చిన పాలతో అభిషేకం, చేస్తారు. తర్వాత నీరు, చందనం (గంధం పేస్ట్), పసుపు, కస్తూరి, సివెట్-నూనె మరియు పచ్చ కర్పూరం (శుద్ధి చేసిన కర్పూరం), వేద స్తోత్రాలు, పురుష సూక్తం మరియు మంత్రాలతో అభిషేకం చేస్తారు. అనంతరం స్వామివారికి పట్టు పీతాంబరాలతో అలంకరించి దర్శనం కల్పిస్తారు. స్వామివారి పాదాల చెంత ఉంచిన కస్తూరి చందనం, పచ్చకర్పూరంతో స్వామికి నామం పెట్టిన ప్యాకెట్‌ను అభిషేక ప్రసాదంగా గృహస్థులకు అందిస్తారు.

Exit mobile version