Jairam Ramesh: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తాం

2024 పార్లమెంటు ఎన్నికల్లో అధికారంలోకి కాంగ్రెస్ వస్తే, వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని సీనియర్ నేతలు జైరాం రమేష్ పేర్కొన్నారు

Special Status: 2024 పార్లమెంటు ఎన్నికల్లో అధికారంలోకి కాంగ్రెస్ వస్తే, వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని సీనియర్ నేతలు జైరాం రమేష్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత తలపెట్టిన భారత్ జోడో యాత్ర మరి కొద్ది రోజుల్లో ఏపీలో అడుగుబెట్టనున్న నేపథ్యంలో ఆయన కర్నూలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

కర్ణాటకలో సాగుతున్న రాహుల్ గాంధీ పాదయాత్ర ఈనెల 18న ఏపీలోకి ప్రవేశిస్తుందని జైరాం రమేష్ పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గం నుండి మంత్రాలయం వరకు నాలుగు రోజుల పాటు 95 కి.మీ మేర ఏపిలో భారత్ జోడో యాత్ర సాగనుందని ఆయన తెలిపారు. అనంతరం 13రోజులపాటు తెలంగాణాలో రాహుల్ పాదయాత్ర ఉంటుందన్నారు.

మరో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ దేశంలో కుల, మతాల పేరుతో భాజపా చిచ్చుపెడుతోందని ఆరోపించారు. విభజించు, పాలించు అనే రీతిలో ఆ పార్టీ పాలన సాగిస్తోందని విమర్శించారు.

సమావేశంలో ఏపి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ ఉమెన్ చాందీ, ఏపిసిసి అధ్యక్షుడు శైలజానాధ్, తులసిరెడ్డి, హర్షకుమార్ తోపాటు ఎంపీ ఉత్తమకుమార్ రెడ్డి, కర్నూలు, నంద్యాల జిల్లాల పార్టీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.

ఒకప్పుడు కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఘనత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంది. విభజన అనంతరం తెలంగాణాకు ఆర్ధిక పరంగా, రాజధాని పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో ప్రభుత్వ పాలన యధావిధిగా సాగిపోతుంది. ఎటొచ్చి రాజధాని లేని నగరంగా, అభివృద్ది ఎక్కడ సాగుతుందో తెలియని విధంగా ఏపీ నానాటికి కుదేలులుగా మారిపోతుంది. విభజనం సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదాపై రాజకీయాలు చేస్తున్న కేంద్రం తీరుతో ప్రజలు కూడా విసిగెత్తిపోయారు.

ఇది కూడా చదవండి:Revanth Reddy: రాహుల్ గాంధీ పాదయాత్రను అడ్డు కొనేందుకే ఈడీ సమన్లు