Site icon Prime9

Rahul Gandhi : తన జీవిత భాగస్వామి ఎలా ఉండాలో చెప్పిన రాహుల్ గాంధీ

congress-leade-rahul-gandhi-opens-about-marriage

congress-leade-rahul-gandhi-opens-about-marriage

Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గురించి అందరికీ తెలిసిందే. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలా వారసత్వాన్ని కొనసాగిస్తూ రాజకీయాల్లో తనకంటూ కొన్ని ప్రత్యేక పేజీలను లిఖించుకున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చేసిన రాహుల్… ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ పదవి నుంచి వైదొలిగారు. ప్రస్తుతం భారత్‌ జోడో యాత్ర పేరుతో దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు రాహుల్. ఈ పాదయాత్రలో ఈపాప్తుకే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా పాల్గొని ఆయనకు మద్దతు పలికారు. అయితే ఈ పాదయాత్రలో భాగంగా ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో రాహుల్ తనకు కాబోయే భార్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆ ఇంటర్వ్యూలో రాహుల్ మాట్లాడుతూ… తన నానమ్మ ఇందిర వంటి మంచి లక్షణాలున్న అమ్మాయి అయి ఉండాలని, అమ్మ, నానమ్మలోని మిశ్రమ లక్షణాలుంటే మరీ మంచిదని చెప్పారు. అదే విధంగా ఇందిరా గాంధీ గురించి చెబుతూ… నానమ్మ అంటే తనకెంతో ప్రేమని, ఆమె తనకు మరో మాతృమూర్తిలాంటి వారన్నారు. కాగా భారత్ జోడో యాత్రలో భాగంగా తమిళనాడులో పర్యటిస్తున్నప్పుడు… మార్తాండంలో ఎంజీఎన్​ఆర్​ఈజీఏ మహిళా వర్కర్లని రాహుల్​ గాంధీ కలిశారు. ఆ సమయంలో జరిగిన సంభాషణ గూర్చి కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ట్వీట్ చేశారు.

వారిలో ఓ మహిళ మీకు తమిళనాడు ఇష్టం అని మాకు తెలుసు. మీకు తమిళ అమ్మాయితో పెళ్లి జరిపిస్తాము అని మాట్లాడింది. ఆ మాట విని రాహుల్​ గాంధీ నవ్వుకున్నారు. ఫొటోలో స్పష్టంగా తెలిసిపోతోంది అని జైరాం రమేశ్​ ట్వీట్​ చేశారు. ప్రస్తుతం 52 ఏళ్ల వయసున్న రాహుల్ గాంధీ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటా అని పలు సందర్భాల్లో మీడియా ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా రాహుల్ పెళ్లి గురించి నోరు విప్పడంతో ఈ విషయం మళ్ళీ చర్చనీయాంశంగా మారింది.

Exit mobile version