Site icon Prime9

CM YS Jagan : వర్చువల్‌ విధానంలో 16 సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన, 12 సబ్‌స్టేషన్ల ప్రారంభోత్సవం చేసిన సీఎం జగన్..

CM YS Jagan started 12 sub stations and foundation for 16 sub stations at ap

CM YS Jagan started 12 sub stations and foundation for 16 sub stations at ap

CM YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. 16 సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన, 12 సబ్‌స్టేషన్ల వర్చువల్‌ విధానంలో ప్రారంభోత్సవం చేశారు.  దాదాపు రూ.3099 కోట్లు సబ్‌స్టేషన్ల కోసం ఖర్చుచేస్తున్నామని సీఎం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోదావరి ముంపు ప్రాంతాల్లో చింతూరు, వీఆర్‌పురం, ఎటపాక తదితర ప్రాంతాల్లో ఇటీవలే తిరిగినప్పుడు సబ్‌స్టేషన్లే లేకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని అక్కడి వారు చెప్పారు.  ఆ సమస్యను పరిష్కరిస్తూ.. అక్కడ సబ్‌స్టేషన్లను ఇవాళ ప్రారంభిస్తూ అక్కడి ప్రజలకు అంకితం చేస్తున్నామని తెలిపారు.

రైతులకు 9 గంటల విద్యుత్‌ పగటి పూటే ఇవ్వాలని అధికారంలోకి రాగానే నిర్ణయించామని సీఎం గుర్తు చేశారు. రాష్ట్ర విద్యుత్‌ రంగ చరిత్రలో తొలిసారిగా ఒకేసారి 28 సబ్‌ స్టేషన్లకు ఆంధ్రప్రదేశ్‌ ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ శ్రీకారం చుట్టింది అని ప్రశంసించారు. దీంతో 14 జిల్లాల్లో విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ బలోపేతం అవుతోందని సీఎం జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. రూ.1700 కోట్ల తో ఫీడర్లను ఏర్పాటు చేసి రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను ఇస్తున్నామని.. ఉచిత విద్యుత్‌ను స్థిరంగా ఇవ్వడానికి రూ.2.4లకే యూనిట్‌ ధరతో సెకీతో ఒప్పందం చేసుకున్నామని వెల్లడించారు. మరో 25 సంవత్సరాల పాటు రైతులకు ఎలాంటి ఢోకా లేకుండా ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం అని చెప్పారు.

 

 

Exit mobile version
Skip to toolbar