Prime9

Andhra Pradesh: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త లబ్దిదారుల ఖాతాల్లో జమ కానున్న డబ్బులు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలకు కొత్తగా ఎంపికైన లబ్ధిదారులకు సీఎం జగన్ నేడు నిధులు విడుదల చేయనున్నారు. వివిధ పథకాలకు 3 లక్షల 39 వేల 96 మంది లబ్ధిదారులు కొత్తగా ఎంపిక కాగా, వారందరికీ ఇవాళ నిధులు మంజూరు కానున్నాయి. పెన్షన్లు, బియ్యం కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల కోసం లబ్ధిదారుల ఎంపిక కాగా, ఈ పథకాల కోసం 137 కోట్లు నిధులను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేస్తారు. ఉదయం 11 గంటలకు క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి నగదు జమ చేస్తారు. మరోవైపు  వైయస్సార్‌ కాపు నేస్తం జూలై 22న, జగనన్న తోడు జులై 26వ తేదీన నిధులు విడుదల చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.

Exit mobile version
Skip to toolbar