CM YS Jagan : బీసీలు అంటే బ్యాక్ బోన్ క్లాసులు అంటున్న సీఎం జగన్

CM YS Jagan : " మీ హృదయంలో జగన్... జగన్ హృదయంలో మీరు ఎప్పటికీ ఉంటారని బీసీలను ఉద్దేశించి సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు విజయవాడలో నిర్వహించిన జయహో బీసీ సభలో జగన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

  • Written By:
  • Publish Date - December 7, 2022 / 03:57 PM IST

CM YS Jagan : ” మీ హృదయంలో జగన్… జగన్ హృదయంలో మీరు ఎప్పటికీ ఉంటారని బీసీలను ఉద్దేశించి సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు విజయవాడలో నిర్వహించిన జయహో బీసీ సభలో జగన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారంతా భారీ ఎత్తున కదిలి వచ్చారు. జనసందోహంతో విజయవాడలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ మాట్లాడుతూ వైకాపా అధికారం లోకి వచ్చిన నాటి నుంచి బీసీల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకున్నామని జగన్ వెల్లడించారు.

బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాసులు కాదని… బ్యాక్ బోన్ క్లాసులని స్పష్టం చేశారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలకు ఉన్నంత చరిత్ర బీసీలకు ఉందని జగన్ చెప్పారు. బీసీలంటే శ్రమ, బీసీలంటే పరిశ్రమ అన్నారు. ఇంటి పునాధి నుంచి పైకప్పు వరకు.. ఇంట్లో, వ్యవసాయంలో ఉపయోగించే ప్రతీ పనిముట్టు వెనక బీసీల శ్రమ ఉందని వివరించారు. బీసీల గురించి శ్రీశ్రీ గారు మహా ప్రస్థానంలో చెప్పినట్లు… కుమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి మగ్గం, శాలెల మగ్గం, గొడ్డలి రంపం, కొడవలి నాగలి ఇలా మన సమస్త గ్రామీణ వృత్తుల సంగమమే బీసీలు అని సీఎం జగన్ కొనియాడారు.

రాజ్యాధికారంలో మేం కూడా భాగమేనని బీసీ లంతా చంద్రబాబుకు చెప్పాలని జగన్ సూచించారు. బీసీలంటే కుట్టుమిషన్లు, ఇస్త్రీ పెట్టెలు కాదని చంద్రబాబుకు చెప్పండన్నారు. 2014 ఎన్నికలలో బీసీల అభివృద్ధికి ఇచ్చిన హామీల్లో కనీసం 10 శాతం కూడా నెరవేర్చని చంద్రబాబుకు చెప్పండి… బీసీలకు ఇచ్చిన హామీలను వందకు వంద శాతం నిలబెట్టుకున్న మా జగనన్న ప్రభుత్వానికి మేమెప్పుడూ వెన్నెముక కులాలుగా ఉంటామని చంద్రబాబుకు చెప్పండి అని జగన్ తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు గుప్పించారు.