Site icon Prime9

CM: ధాన్యం కొనుగోళ్లు సాఫిగా సాగాలి: అధికారులకు సీఎం ఆదేశం

CM Revanth Reddy: రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేలా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని జిల్లాల్లో కొనుగోళ్లు చేపట్టాలని సీఎంఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి కోనుగోలు కేంద్రాలను సందర్శించాలన్నారు. అలాగే కొనుగోళ్లు జరుగుతున్న తీరును పరిశీలించి.. ఏమైనా సమస్యలు ఉంటే అక్కడికిక్కడే పరిష్కరించాలని సూచించారు. అదే విధంగా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు ప్రతి ఉమ్మడి జిల్లాకో ఐఏఎస్‌ను ప్రత్యేక అధికారిగా నియమించింది.

నియమితులైన ప్రత్యేక అధికారులు వీరే

కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల: ఆర్‌వీ కర్ణన్‌

ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమరం భీం, ఆసిఫాబాద్‌, మంచిర్యాల: కృష్ణ ఆదిత్య

నిజామాబాద్‌, కామారెడ్డి: డాక్టర్‌ ఎ. శరత్‌

నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట: అనితా రామచంద్రన్‌

మహబూబ్‌నగర్‌, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్‌ కర్నూల్‌: రవి

రంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్‌: డి. దివ్య

వరంగల్‌, హనుమకొండ, జనగామ, జయశంకర్‌ భుపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌: టి వినయ కృష్ణారెడ్డి

మెదక్‌, సంగరెడ్డి, సిద్దిపేట: హరిచందన

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం: కె సురేంద్ర మోహన్‌

Exit mobile version