Site icon Prime9

Kondagattu: కొండగట్టులో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు.. 25 ఏళ్ల తర్వాత వచ్చిన సీఎం

kondagattu kcr

kondagattu kcr

Kondagattu: సీఎం కేసీఆర్ కొండగట్టు పర్యటన కొనసాగుతుంది. కొండగట్టు ఆలయానికి వచ్చిన ఆయనకి అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం.. కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేదాశీర్వచనం.. తీర్థ ప్రసాదాలు కేసీఆర్ కు అందజేశారు. కేసీఆర్ తో కలిసి.. మంత్రులు, అధికారులతో కలిసి ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.

ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన.. (Kondagattu)

హైదరాబాద్‌ నుంచి కేసీఆర్ ప్రత్యేక హెలికాప్టర్‌లో చేరుకున్నారు. కొండగట్టు సమీపంలోని జేఎన్టీయూకు చేరుకున్న కేసీఆర్‌కు మంత్రులు ఘన స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి.. రోడ్డు మార్గంలో ఆంజన్న ఆలయానికి చేరుకున్నారు. కొండగట్టుపై ఉన్న కోనేరు, పుష్కరిణి, సీతమ్మ కన్నీటిధార, బేతాళస్వామి ఆలయం, కొండలరాయుడి గుట్ట స్థలాలను పరిశీలించారు. అనంతరం జేఎన్టీయూ వెళ్లి.. అక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులతో కేసీఆర్ సమీక్షా నిర్వహిస్తారు. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంలో చేయాల్సిన మార్పులు-చేర్పులపై చర్చించనున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా.. అభివృద్ధి పనులపై సమాలోచనలు చేయనున్నారు.

25 ఏళ్ల తరువాత కొండగట్టుకు సీఎం..

సీఎం కేసీఆర్ కొండగట్టు పర్యటన కొనసాగుతుంది. దాదాపు 25 ఏళ్ల తర్వాత కేసీఆర్ కొండగట్టుకు వచ్చారు. తొలిసారిగా సీఎం హోదాలో ఇక్కడకి వచ్చినట్లు సమాచారం. మెుదటి సారిగా కేసీఆర్ 1998లో ఇక్కడికి వచ్చారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇక్కడికి రావడం విశేషం. గత సంవత్సరం డిసెంబర్ లో జగిత్యాలకు వచ్చిన కేసీ కేసీఆర్.. కొండగట్టుపై వరాల జల్లు కురిపించారు. కొండగట్టు ఆలయాన్నిపూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని కేసీఆర్ తెలిపారు. సీఎం హామీ ఇవ్వడంతో రెండు నెలల్లోనే రూ. 100 కోట్లను మంజూరు చేశారు.

కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం..

కొండగట్టు ఆలయానికి విశిష్ట చరిత్ర ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు తాము కోరిన కోర్కెలు తీరుతాయని ప్రగఢంగా నమ్ముతారు. జగిత్యాల జిల్లాలోని కరీంనగర్- జగిత్యాల ప్రధాన రహదారికి ఈ ఆలయం ఆనుకొని ఉంటుంది. ఈ ఆలయానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. సకల సౌకర్యాలతో ప్రభుత్వం ఇక్కడి అభివృద్ధి పనులను చేపడుతుంది. ఇదివరకే.. అభివృద్ధి పనులను చేయాలని అధికారులు నివేదికలు రూపొందించారు. ఇక సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా కొండగట్టులో భారీ భద్రత ఏర్పాటు చేశారు.

 

Exit mobile version