Site icon Prime9

CM YS Jagan: సీఎం జగన్ ఏరియల్ సర్వే

Andhra Pradesh: గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్ ఏరియల్ సర్వే చేపట్టారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఏరియల్ సర్వే అనంతరం అధికారులతో సీఎం జగన్ సమీక్ష జరిపారు. గోదావరి వరదలపై ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారికి తగిన సౌకర్యాలను కల్పించాలని ఆదేశించారు.

ముంపు గ్రామాలు, వరద బాధితులకోసం ఏర్పాటుచేసిన శిబిరాలు, అందుతున్న సౌకర్యాలు, నిత్యావసరాల సరఫరా, అత్యవసర సేవలు, వైద్య సేవలు, మందులు తదితర అంశాలపై సీఎం జగన్‌ ఆరా తీసారు.వరద ప్రభావిత జిల్లాలకు ఒక్కో సీనియర్‌ అధికారి నియమించాలన్నారు. వచ్చే 24 గంటలు హైఅలర్ట్‌గా ఉండాలని సీఎం అధికారయంత్రాంగాన్ని ఆదేశించారు.

Exit mobile version