Site icon Prime9

Cinema lovers Day: టాలీవుడ్ టూ బాలీవుడ్.. ఏ సినిమా టికెట్ అయినా రూ.99 కే

Pvr cinemas

Pvr cinemas

Cinema lovers Day: మల్టి ప్లెక్స్ (multiplex )లో ఒక ఫ్యామిలీ సినిమా చూడాలంటే వేలకు వేలు ఖర్చు అవుతోంది. కనీసం ఒకరు సినిమాకు వెళ్లినా కనీసం రూ.1000 లు కావడం ఖాయం.

ఈ క్రమంలో పీవీఆర్ సినిమాస్ (PVR Cinemas) మూవీ లవర్స్ కోసం ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

దీంతో అతి తక్కువ ధరకు కొత్తగా రిలీజ్ అయిన సినిమాలను చూసే ఛాన్స్ కల్సిస్తోంది పీవీఆర్ సినిమాస్.

సినిమా లవర్స్ కోసం జస్ట్ రూ. 99 లకే టికెటను అందిస్తున్నట్టు ప్రకటించింది. జనవరి 20 వతేదీన ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

పీవీఆర్ సినిమాస్ లో అన్ని షోలను 99 రూపాయల ఆఫర్ వర్తిస్తుంది. సినిమా లవర్స్ డే సందర్భంగా ఈ ఆఫర్ ప్రకటించింది పీవీఆర్.

అయితే ఎంపిక చేసిన సిటీల్లో మాత్రమే ఈ అవకాశాన్ని అందిస్తున్నారు. టికెట్ రేట్లకు జీఎస్టీ అదనంగా ఉంటుంది.

ఆఫర్ వివరాలివే..

జనవరి 20 వ తేదిన అన్ని షోలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.

తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ టో టికెట్ ధర రూ.100 తో పాటు జీఎస్టీ ఉంటుంది. తెలంగాణలో రూ.112 తో పాటు జీఎస్టీ ఉంటుంది.

చండీఘడ్ , పఠాన్ కోఠ్, పుదుచ్చేరి నగరాల్లో ఉన్న పీవీఆర్(Cinema lovers Day) సినిమాస్ లో ఈ ఆఫర్ వర్తించదు.

జనవరి 20న ఈ ఆఫర్ తప్ప ఇతర ఏ ఆఫర్లు ఉండవు. పూర్తిగా షరతులు వర్తిస్తాయి.

ప్రీమియం కేటగిరి సీట్స్( రెక్లెయినర్, ఐమ్యాక్స్, 4డీఎక్స్) కు ఈ ఆఫర్ ఉండదు.

ఈ ఆఫర్ కు సంబంధించిన పూర్తి వివరాలకు పీవీఆర్ (PVR Cinemas)వెబ్ సైట్ చూడాలని తెలిపింది.

 

ఆఫర్స్ తో ఆకర్షిస్తున్న మల్టి ప్లెక్స్ లు

ప్రస్తుతం ఓటీటీ కాలం నడుస్తున్నా.. కరోనా తర్వాత సాధారణ థియేటర్ల కంటే మల్టి ప్లెక్స్ (multiplex )ల కు ప్రేక్షకులు ఎక్కువగా వెళ్తున్నారు.

పెద్ద సినిమాలు వచ్చినపుడు బిగ్ స్క్రీన్ పై సినిమా చూసేందుకే ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రేక్షకులను మరింత ఆకర్షించేందుకు మల్టిఫెక్స్ లు వివిధ రకాల ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి.

గత ఏడాది మల్టి ప్లెక్స్ అసోసియేషన్ కూడా సినిమా లవర్స్ కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది.

నేషనల్ సినిమా డే సందర్భంగా సెప్టెంబర్ 16 న  కేవలం రూ. 75 లకే అన్ని మల్టి ఫెక్స్ ల్లో ఒక రోజు మూవీ చూసే అవకాశాన్ని కల్పించింది.

తాజాగా పీవీఆర్ సినిమాస్ కూడా మల్టి ప్లెక్స్ ల్లో అతి తక్కువ ధరలో మూవీ చూసే ఛాన్స్ ను కల్పించడం విశేషం.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version