Site icon Prime9

Vijayawada : విజయవాడలో సీఐ, కానిస్టేబుల్ సస్పెన్షన్… కారణం ఏంటంటే ?

ci and constable suspended in vijayawada for not controlling traffic

ci and constable suspended in vijayawada for not controlling traffic

Vijayawada : విజయవాడ ఐదోవ టౌన్ ట్రాఫిక్ స్టేషన్ సీఐ రవికుమార్, కానిస్టేబుల్ రాంబాబును సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ క్రాంతి రతన్ టాటా ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చంద్ర చూడ్ విజయవాడ పర్యటనలో ట్రాఫిక్ నియంత్రణ సక్రమంగా లేకపోవడం డిజిపి పరిశీలించి, సిపికి సమాచారం ఇవ్వడంతో.. విధి నిర్వహణ లో నిర్లక్ష్యంగా ఉన్నందుకు సస్పెండ్ చేసినట్లు సమాచారం అందుతుంది.

కాగా కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దేవాలయాలు, చర్చిల్లో ప్రత్యేక దర్శనాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ, వైజాగ్ లాంటి నగరాల్లో పార్టీల కోసం వివిధ సంస్థలు ఏర్పాట్లు చేసుకున్నాయి. అయితే అర్ధరాత్రి బహిరంగ వేడుకలకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి చెందే సూచనలు ఉన్న క్రమంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

విజయవాడ లోని బందర్ రోడ్, ఏలూరు రోడ్, బీఆర్టిఎస్  రోడ్లపై ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. బెంజ్ సర్కిల్, కనకదుర్గ, పీసీఆర్ పైవంతెనలపైకి వాహనాలకు అనుమతించడం లేదు. క్లబ్బులు, రెస్టారెంట్లలో వేడుకలకు పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువ శబ్దాలు వచ్చే సౌండ్ సిస్టం వాడకూడదన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Exit mobile version