Site icon Prime9

Chiranjeevi: జపాన్‌ వెళ్లనున్న మెగాస్టార్‌ చిరంజీవి – ఎందుకో తెలుసా?

Chiranjeevi vishwambhara Shooting Update: మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీతో బిజీగా ఉన్నాడు. బింబిసార ఫేం మల్లిడి విశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డెబ్యూ చిత్రంతోనే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టాడు వశిష్ఠ. పిరియాడికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో సోషియా ఫాంటసి డ్రామా వచ్చిన బింబిసార చిత్రం రూ. 100 కోట్ల గ్రాస్‌ వసూళ్లు చేసింది. ఈ చిత్రం కళ్యాణ్‌ రామ్ కెరీర్‌లో మైలురాయి చిత్రంగా నిలిచింది. తొలి చిత్రం రికార్డు క్రియేట్‌ వశిష్ఠ.. ఆ తర్వాత ఏకంగా మెగాస్టార్‌ చిరంజీవినే మెప్పించాడు.

ఈసారి కూడా పిరియాడికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో సోషియో ఫాంటసిగా విశ్వంభర రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ షూటింగ్‌ జరపుకుంటున్న ఈ సినిమా కోసం త్వరలోనే మూవీ టీం జపాన్ వెళ్లనుందట. ఈ షెడ్యూల్లో చిరంజీవి కూడా పాల్గొంటారని తెలుస్తోంది. అక్కడ పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉందట. కాగా ప్రస్తుతం విశ్వంభర VFX వర్క్‌ని జరుపుకుంటుంది. ఇటీవల డబ్బింగ్‌ వర్క్‌ని కూడా స్టార్ట్‌ చేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ పార్ట్‌ ఇంకా మిగిలే ఉందట. ఈ షెడ్యూల్‌ను వశిష్ఠ జపాన్‌లో ప్లాన్‌ చేశాడట. ఈ షూటింగ్‌ కోసం మెగాస్టార్‌ జపాన్‌ పయనం కానున్నారట.

అంటే రేపు(బుధవారం) చిరంజీవి ప్రత్యేక ప్లైట్‌లో జపాన్‌ వెళ్లనున్నాడని తెలుస్తోంది. జపాన్‌లో జరిగే ఈ షూటింగ్‌ క్లైమాక్స్‌ సంబంధించిందని తెలుస్తోంది. ఇది సినిమాకే హైలెట్గా నిలవనుందట. చెప్పాలంటే అంజీ సినిమాలోని క్లైమాక్స్‌ మించి ఇది ఉండేలా తెలుస్తోంది. కాగా ఈ సినిమాను మొదట వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేశారు. కానీ అదే టైంలో గేమ్ ఛేంజర్‌ రిలీజ్‌ అవుతుండటం విశ్వంభర టీం నిర్ణయం మార్చుకుంది. ఇక విశ్వంభర సమ్మర్‌ కానుకగా మే 9న రిలీజ్‌ చేయబోతున్నట్టు ఇటీవల తెలిపింది. కాగా యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీకృష్ణ ఉప్పలపాటి, విక్రమ్‌ రెడ్డిలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుమారు రూ. 200 కోట్ల వ్యయంతో విశ్వంభర తెరకెక్కిస్తున్నట్టు సినీవర్గాల నుంచి సమాచారం.

Exit mobile version