Site icon Prime9

Actress Kasturi: తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు – పోలీసుల అదుపులో నటి కస్తూరి శంకర్‌

Actress Kasturi Shankar Arrest: సినీ,టీవీ నటి కస్తూరి శంకర్‌ని చెన్నై పోలీసులు అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న ఆమెను హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్నట్టు గురించి పోలీసులు శనివారం సాయంత్రం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చెన్నైకి తరలించారు. కాగా ఇటీవల ఆమె తెలుగువారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఆమెపై పలు మధురై, చెన్నైలో పలు కేసులు నమోదవ్వగా.. ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే.

ఇటీవల బ్రహ్మణులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్‌ చేసే క్రమంలో తెలుగువారిపై కస్తూరి అభ్యంతరకర కామెంట్స్‌ చేసింది. 300 ఏళ్ల క్రితం రాజుల పరిపాలనలో అంత:పుర మహిళలకు సేవ చేయడానికి తెలుగు వారు తమిళనాడుకు వచ్చారని, అలా వచ్చినవారంత ఇప్పుడు మాది తమిళ జాతి అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారంది. అలాంటప్పుడు ఎప్పుడో ఎక్కడకు వచ్చిన బ్రహ్మణులు తమిళులు కాదని చెప్పడానికి వారెవరంటూ ప్రశ్నించింది. దీంతో ఆమె వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అయితే అప్పటికే నిరసనతో ఉద్రిక్తత పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కస్తూరి వ్యాఖ్యలు అల్లర్లను మరింత రెచ్చగోట్టేల ఉండటంతో పలు ప్రాంతాలపై ఆమెపై కేసులు నమోదయ్యాయి.

దీంతో కస్తూరి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ మీడియా ముందు తెలుగువారి బహిరంగంగా క్షమాపణలు చెప్పింది. అయితే అప్పటికే పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. విచారణకు హాజరవ్వాలని నోటీసులు జారీ వాటికి ఆమె స్పందించకపోవడంతో స్వయంగా పోలీసులు ఇంటికి వెళ్లారు. దీంతో ఆమె ఇంటికి తాళం వేసి ఉండటంతో ఆమె పరారీలో ఉన్నట్టు గుర్తించిన పోలీసుల ఆమె కోసం గాలింపులు చేపట్టారు. ఈ క్రమంలో నిన్న సాయంత్రం ఆమె గచ్చిబౌలిలో పోలీసులకు చిక్కారు. కాగా ఈ కేసులో కస్తూరి ముందస్తు బెయిల్‌ కోసం మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించింది. తన ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్‌ వేయగా.. దానికి విచారించిన ధర్మాసనం పటిషన్‌ను కొట్టివేసింది. అంతేకాదు అల్లర్లను రెచ్చగోట్టేలా చేసిన ఆమె వ్యాఖ్యలపై కస్తూరిపై మండిపడుస్తూ.. తనపై చర్యలు తీసుకోవాల్సిందిగా హైకోర్టు తీర్పునిచ్చింది.

Exit mobile version