Site icon Prime9

Chandini Chowdary: చాందిని చౌదరి షాకింగ్‌ నిర్ణయం – కొంతకాలం పాటు సోషల్‌ మీడియాకు దూరం, ఎందుకంటే..!

Chandini Chowdary Post Viral: కలర్‌ ఫోటో ఫేం చాందిని చౌదరి తీవ్రంగా గాయపడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్‌ మీడియాలో వేదిక వెల్లడించింది. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ షేర్‌ చేసింది. “హలో గాయ్స్‌.. గత కొద్ది రోజలుగా నేను సోషల్‌ మీడియాకి రావడం లేదు. ఎందుకంటే కొన్ని నెలల క్రితం నేను తీవ్రంగా గాయపడ్డాను. కానీ దాన్ని నేను పట్టించుకోకుండ లైట్‌ తీసుకున్న. గాయంతోనే షూటింగ్స్, ఈవెంట్స్‌లో పాల్గొన్నాను.

ఇప్పుడు ఆ గాయం తిరగబడింది. నొప్పి మరింత ఎక్కువ అయ్యింది. దీంతో షూటింగ్స్‌కి బ్రేక్‌ కొన్నాళ్లుగా విశ్రాంతి తీసుకుంటున్నా. అందుకే అన్నింటికి దూరంగా ఉంటున్నారు. త్వరలోనే మళ్లీ సోషల్‌ మీడియాలోకి వస్తా” అంటూ ఇన్‌స్టాలో స్టోరీ షేర్‌ చేసింది. ప్రస్తుతం ఆమె పోస్ట్‌ నెట్టింట చర్చనీయాంశం అయ్యింది. అయితే ఆమెకు గాయం ఎక్కడ అయ్యింది, ఎలా అయ్యిందనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఆమె అభిమానులు, ఫాలోవర్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆమె త్వరగా కోలుకోవాలని, అతి త్వరలోనే మళ్లీ యాక్టివ్‌ అవ్వాలని కోరుకుంటూ దేవుడిని ప్రార్థిస్తున్నారు. కాగా చాందిని చౌదరి గురించి ప్రత్యకంగా చెప్పనవసరం లేదు. తెలుగు అమ్మాయి అయిన ఆమె షార్ట్స్‌ ఫిలింస్‌ ద్వారా కెరీర్‌ ప్రారంభించింది. ఎన్నో షార్ట్‌ ఫిలింస్‌లో నటించిన ఆమె ఆ తర్వాత ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. హీరోయిన్‌ సినిమాలు చేసింది. కలర్‌ ఫోటోతో హీరోయిన్‌ ఎంతో గుర్తింపు పొందిన ఆమె ఆ తర్వాత గామి, మ్యూజిక్‌ షాప్ మూర్తి, యేవమ్‌ వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె బాలకృష్ణ కొత్త సినిమాలో నటిస్తుంది.

Exit mobile version