Case Filed on Mohan Babu: కుటుంబంలో వివాదాలు, గొడవలతో సతమవుతున్న మోహన్ బాబుకు పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయనపై BNS118 కింద కేసు నమోదు చేస్తూ నోటీసులు జారీ చేశారు. మీడియా ప్రతినిథిపై దాడి చేసిన నేపథ్యంలో పహాడీ షరీఫ్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. గత మూడు నాలుగు రోజులు సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో ఘర్షణలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్‌తో ఆస్తి తగాదాలు రచ్చకెక్కాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఆయన జల్‌పల్లిలోని ఆయన నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
మనోజ్ తన అనుచరులతో కలిసి ఫామ్‌హౌజ్‌లోకి చోరబడే ప్రయత్నం చేస్తుండగా.. మోహన్ బాబు, విష్ణు బౌన్సర్లు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జల్‌పల్లికి భారీ స్థాయిలో మీడియా ప్రతినిధులు చేరుకుని సంఘటన గరించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇంటి నుంచి బయటకు వచ్చిన మోహన్ బాబును ఓ మీడియా ప్రతిని ప్రశ్నించగా.. ఏం చెప్పాలి రా అంటూ మైక్ లాగి అతడిపై దాడి చేశాడు. ఈ దాడిలో సదరు మీడియా ప్రతినిధి తలకు గాయమైంది.
దీంతో మోహన్ బాబు క్షమాపణలు చెప్పాలని జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరగడంతో జర్నలిస్ట్ సంఘాలు తీవ్ర అసహనానం వ్యక్తం చేశాయి. వెంటనే మీడియాకు మోహన్ బాబు క్షమాపణలు చెప్పాలని అక్కడే ధర్నాకు దిగారు. అంతేకాదు ఆయనపై కేసు నమోదు చేయాలని నిరసనలు రావడంతో పోలీసులు మోహన్ బాబు బీఎన్‌ఎస్ 118 కింత కేసు నమోదు చేశారు. అలాగే బుధవారం ఉదయం విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ రాచకొండ నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉంటే మంగళవారం రాత్రి మోహన్ బాబు ఇంటి దగ్గర జరిగిన గొడవ దృష్ట్యా తమ వద్ద ఉన్న లైసెన్స్ గన్స్ సరెండర్ చేయాలనిమోహన్ బాబు, విష్ణులు పోలీసులు ఆదేశించారు.