Site icon Prime9

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్ర స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ బస్సు ప్రయాణికులతో వెళ్తుండగా, ధార్ జిల్లా ఖల్‌ఘాట్‌ వద్ద అదుపుతప్పి నర్మదా నదిలో పడిపోయింది. ఈ ఘటనలో పదమూడు మంది మృతిచెందినట్టుగా సమాచారం. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సాయంతో బస్సును బయటకు తీసామని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 51మందికిపైగా ఉన్నట్లు సమాచారం.

అయితే, ఇప్పటివరకు 13 మంది మృతదేహాలను నది నుండి బయటకు తీయగా, 15 మందిని రక్షించారు. ఇంకా నదిలో 25 మంది దాకా గల్లంతైనట్లుగా సమాచారం. ఈ ప్రమాదం పై ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ స్పందించారు. సమాచారం అందిన వెంటనే ప్రమాద స్థలానికి చేరుకోవాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రులకు వెంటనే తగు చికిత్స అందించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఆదేశాలతో ఖర్గోన్, ధార్, ఇండోర్ జిల్లాల యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Exit mobile version