Site icon Prime9

Ananya Panday : బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేపై ఫైర్ అవుతున్న నెటిజన్లు..

bollywood actress ananya panday facing social media trolling

bollywood actress ananya panday facing social media trolling

Ananya Panday : బాలీవుడ్ బ్యూటీ ” అనన్య పాండే ” గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2’ ఫిల్మ్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అనన్య పాండే. ఆ తర్వాత పతి పత్ని ఔర్ వహ్ లాంటి చిత్రాల్లో నటించింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకి పాండే కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన అనన్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ.

కాగా విజయ్ దేవరకొండ లైగర్ చిత్రంతో అనన్య పాండే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎంత దారుణ పరాజయాన్ని మూటగట్టుకుందో తెలిసిందే. అయితే అనన్య మాత్రం నాజూకు అందాలు ఆరబోస్తూ.. విజయ్ దేవరకొండతో అద్భుతమైన కెమిస్ట్రీ పండించింది. పాన్ ఇండియా మూవీగా ఈ ఏడాది రిలీజైన లైగర్ మూవీ డిజాస్టర్‌గా మిగిలింది. దాంతో ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో చెప్పుకోదగ్గ సినిమా లేదు. లైగర్‌ మూవీ రిలీజ్‌కి ముందు వచ్చిన హైప్ దృష్ట్యా.. అప్పట్లో అనన్య కోసం చాలా మంది నిర్మాతలు ప్రయత్నించారు. కానీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ మూవీ బోల్తా పడడంతో అనన్యకి ఛాన్స్ లు తగ్గినట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉండగా ఈ యంగ్ బ్యూటీ తాజాగా దారుణమైన ట్రోలింగ్ కి గురవుతుంది. అనన్య పాండే ఫ్యామిలిలో పెళ్లి సంబరాలు జరుగుతున్నాయి. ఆమె కజిన్ అలన్నా వివాహం జరుగుతోంది. మెహందీ వేడుకలో అనన్య పాండే సిగరెట్ తాగుతూ కనిపించింది. ఆ ఫోటోలు లీక్ కావడంతో అనన్యపై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. దీంతో అనన్యకి స్మోకింగ్ అలవాటు ఉందా అంటూ నెటిజన్లు షాక్ అవుతున్నారు.  పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం, దయచేసి ఆ అలవాటు మానేయ్‌’ అని కొంతమంది.. ఇంతకాలం అనన్య మంచి అమ్మాయి అనుకున్నాం ఇలాంటిదనుకోలేదు అంటూ మరి కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. గతంలో మౌనిరాయ్, రణబీర్ కపూర్ కలిసి సిగరెట్ తాగుతున్న దృశ్యాలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.

మరోవైపు ఇటీవలే అనన్య పాండే తాజా ఫ్యాషన్ షోలో ఆదిత్య రాయ్ కపూర్ తో కలిసి ర్యాంప్ వాక్ చేయడం హాట్ టాపిక్ గ్గా మారింది. అనన్య – ఆదిత్య డేటింగ్ లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే  వీరిద్దరికి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్ అవుతుందనీ అంటుున్నారు. ఈ క్రమంలో ఇలా దర్శనమివ్వడం పట్ల సందేహిస్తున్నారు. మరోవైపు వీరిద్దరూ ఓపెన్ గానే ఆయా ఈవెంట్లకు కలిసి హాజరవుతుండటంతో డేటింగ్ కన్ఫమ్ అంటున్నారు. ముంబైలో పలుమార్లు కలిసే డినర్లు చేస్తున్నట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి. లేటెస్ట్ ఫొటోలపై బాలీవుడ్ రూమర్డ్ కపుల్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో నెట్టింట వైరల్ గా మారాయి.  ప్రస్తుతం అనన్య ‘డ్రీమ్ గర్ల్2’ సినిమాలో నటిస్తుండగా.. ఆమె నటించిన మరో రెండు హిందీ చిత్రాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.

Exit mobile version