Site icon Prime9

Bollywood : బాలీవుడ్ లో తీవ్ర విషాదం.. ఒకే రోజు నటుడు రితేష్, నటి వైభవి ఉపాధ్యాయ మృతి

bollywood actors nithesh and vaibhavi upadhyaya passed away

bollywood actors nithesh and vaibhavi upadhyaya passed away

Bollywood : ఇటీవల సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. మే 22 వ తేదీన టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు మరణించగా.. 23 వ తేదీన హాలీవుడ్, ఆర్ఆర్ఆర్ నటుడు రే స్టీవెన్ సన్ కన్నుమూశారు. ఈ విషాద సమయంలోనే బాలీవుడ్ లో ఈరోజు ( మే 24, 2023 ) ఇద్దరూ ప్రముఖులు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రముఖ యువ నటి వైభవి ఉపాధ్యాయ యాక్సిడెంట్ లో మరణించింది.

ఈ విషయాన్ని బాలీవుడ్ నిర్మాత మజేథియా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. బాలీవుడ్ లో ప్రముఖ కామెడీ సీరియల్ సారాభాయ్ వర్సెస్ సారాభాయ్ తో గుర్తింపు తెచ్చుకుంది నటి వైభవి ఉపాధ్యాయ. ఆ తర్వాత సిఐడీ, అదాలత్ వంటి టీవీ షోలలో కూడా నటించింది. చెపాక్, తిమిర్.. లాంటి పలు సినిమాల్లో కూడా వైభవి నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందనేది పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

 

వైభవి ఉపాధ్యాయ మరణ వార్త తెలిసిన కొద్దీ గంటల్లోనే మరో ప్రముఖ బాలీవుడ్ నటుడు నితేశ్ పాండే కూడా కన్ను మూశారని సమాచారం అందింది. షూటింగ్ కోసం నితేశ్ పాండే నాసిక్ దగ్గర్లోని ఇగత్‌పురికి వెళ్లగా ఇవాళ తెల్లవారుజామున హోటల్ లో హార్ట్ అటాక్ తో కన్నుమూసినట్టు సమాచారం వచ్చింది. దీంతో బాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. దబాంగ్ 2, ఓం శాంతో ఓం, బదాయిహో.. లాంటి పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు నితేశ్ పాండే. పలు టీవీ సీరియల్స్, సిరీస్ లలో కూడా నటించాడు. చివరిసారిగా అనుపమ అనే సిరీస్ లో మెప్పించాడు నితేశ్ పాండే.

51 ఏళ్ళ వయసులో నితేశ్ పాండే గుండెపోటుతో మరణించాడని తెలియడంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆమె భార్య అర్పిత పాండే కూడా టీవీ నటి అని తెలిసిందే. అయితే నితేశ్ పాండే హోటల్ లో సడెన్ గా చనిపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. బాలీవుడ్ సినీ, టీవీ ప్రముఖులు నితేశ్ కు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. అనూహ్య రీతిలో ఒక్క రోజే ఇద్దరూ ప్రముఖులు మృతి చెందడం పట్ల హిందీ పరిశ్రమలో తీవ్ర దుఖంలో మునిగిపోయింది.

 

 

Exit mobile version