Site icon Prime9

Sunil Shetty: షూటింగ్‌ సెట్‌లో ప్రమాదం – సునీల్‌ శెట్టికి గాయాలు, ట్వీట్‌ చేసిన నటుడు

Sunil Shetty on His Injury: బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి షూటింగ్‌లో గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారని, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నట్టు ఇటీవల బాలీవుడ్‌ మీడియాల్లో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా తనకు జరిగిన ప్రమాదంపై స్పందించారు సునీల్‌ శెట్టి. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఆయన పోస్ట్‌ షేర్‌ చేశారు.

ప్రస్తుతం ఆయన హంటర్‌ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత ఆయన ఓటీటీలో నటిస్తున్న సిరీస్‌ ఇది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సిరీస్‌లో సునీల్‌ శెట్టి ఇటీవల యాక్షన్‌ సీక్వెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫైట్ సీన్స్‌ చేస్తుండగా ఆయనకు ప్రమాదం బారిన పడ్డారు. ఈ సీన్‌లో ఒక చెక్క లాగ్‌ అనుకోకుండా ఆయన పక్కటెముకలకు తగిలిందని సన్నిహితులు తెలిపారు. దీంతో ఆయనను వెంటనే ముంబైలో ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ నేపథ్యంలోఆయనకు గాయాలు అవ్వడంతో నిలిచిపోయింది. కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న ఆయన ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారు.

ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తను తగింది చిన్న గాయమే అని, ప్రస్తుతం కోలుకున్నానని చెప్పారు. అతిత్వరలోనే తిరిగి షూటింగ్‌లో పాల్గొంటారని, ఎవరూ ఆందోళన పడోద్దని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. దీంతో ఆయన అభిమానులంతా ఊపిర పీల్చుకుంటున్నారు. కాగా హంటర్‌ వెబ్‌ సిరీస్‌ను ముంబై అండర్‌ వరల్డ్‌ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో సునీల్‌ శెట్టి పోలీసు ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఇందులో సునీల్‌ శెట్టితో పాటు ఈషా డియోల్‌, బర్ఖా బిష్త్‌, కరణ్వీర్‌ శర్మ, రాహుల్‌ దేవ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version