TTD Chairman Subbareddy: ఆయన ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ఆధ్యాత్మిక కేంద్రంలోని ఓ కీలకమైన వ్యక్తి. శాంతిని కోరుకుంటూ భగవంతుని నామస్మరణను భక్తుల దరిచేర్చే బాధ్యతే ఆ పదవిలో ఆయన ధరించే అందమైన కిరీటం. అయితే ఓ వైపు ఆధ్యాత్మికతను భక్తులకు తెలియచేస్తూ, మరో వైపు ప్రజల్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి, నేను సైతం నా వారి బాటలోనే అని అందరూ అనుకొనేలా ప్రవర్తించిన ఆ ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకొనింది.
వివరాల్లోకి వెళ్లితే.. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునేందుకే అమరావతి రైతులు మహా పాదయాత్ర పేరుతో వస్తున్నారని, దాన్ని అడ్డుకోవాలంటూ తితిదే ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి పేర్కొన్నారు. విశాక పశ్ఛిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆనంద్ కుమార్ నేపథ్యంలో ప్రారంభమైన వైకాపా పార్టీ కార్యక్రమంలో ఆయన ఈ మాటలు పేర్కొన్నారు.
పాదయాత్ర పేరుతో ఉత్తరాంధ్రపై దండయాత్రకు రావడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. విశాఖ అభివృద్ది అంటే ఉత్తరాంధ్ర సంపూర్ణ అభివృద్ధిగా ఆయన పేర్కొన్నారు. రాజధానిగా అమరావతిలో నిర్మించాలంటూ లక్షల కోట్లు అవసరమని, ఇప్పుడున్న పరిస్ధితిలో అది సాధ్యం కాదని తేల్చేశారు. పేదల సంక్షేమ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జరగాలన్నదే సీఎం జగన్ లక్ష్యంగా ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆధ్యాత్మిక సంస్ధలో కీలకంగా ఉంటూ రాజకీయ ప్రేలాపనలు చేయడంపై సర్వత్రా చర్చకు దారితీసింది.
గతంలో ఏపి మంత్రులు పలువురు రైతుల పాదయాత్రపై అసభ్యంగా మాట్లాడివున్నారు. అవహేళన కూడా చేసివున్నారు. అయితే రైతులు మాత్రం ఒక రాష్ట్రం, ఒకే రాజధానిగా ఉండాలి, అది కూడా నాడు పాలక, ప్రతిపక్షాలన్నీ ఒప్పుకొన్న అమరావతినే రాజధానిగా ఉంచాలంటూ శాంతియుతంగా పాదయాత్రను సాగిస్తున్నారు. 3 రాజధానుల పేరుతో ప్రభుత్వం చేస్తున్న కాలయాపనపై వారు 5కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియచేసే బాధ్యతను పాదయాత్ర రూపంలో ఎంచుకొన్నారు.
ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల రూపంలో అనుమతిని ఇవ్వన్నప్పటికీ, న్యాయస్ధానం ద్వారా అనుమతులు తెచ్చుకొని మరీ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. పాదయాత్ర ప్రారంభం నాటి నుండి రైతులను కవ్విస్తూ, వారిని రెచ్చగొడుతున్న వైకాపా శ్రేణులతోపాటు తాజాగా తితిదే ఛైర్మన్ కూడా అదే తరహాలో మట్లాడారు.
ఇది కూడా చదవండి: Kejriwal vs Delhi LG: చల్ల బడండి లెప్టినెంట్ జీ, నా భార్య కూడా ఇన్ని ప్రేమ లేఖలు వ్రాయలేదు…