Nellore: మునుగోడు ఉపఎన్నికలో భాజపా నైతికంగా విజయం సాధించిందని, అయితే ప్రలోభాలు, బెదిరింపులతో ఓటమిని చూడాల్సి వచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నెల్లూరులో పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి మీడియాతో ఈ మాటలు అన్నారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, విజయవాడ మీడియా వర్క్‌షాప్ వర్తాలాప్ లో ఆయన పాల్గొన్నారు.
డిపాజిట్ కూడా రాని స్థాయి నుండి గట్టి పోటీ నిచ్చే స్థాయికి భాజపా మునుగోడులో ఎదిగిందన్నారు. రెండో స్థానంలో నిలబడడమే అందుకు నిదర్శనమన్నారు. కుల్వకుంట్ల కుటుంబానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఈ ఎన్నికలతోనే అసలు ఆట ప్రారంభమైందన్నారు. ఇకపై తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరింత కసిగా పనిచేస్తామన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేసిఆర్ పాలనకు చరమగీతం తప్పదన్నారు. భాజపా విజయంపై ధీమా వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Munugode by poll results: మునుగోడు కారుదే.. సంబరాల్లో ప్రగతిభవన్