Munugodu: మునుగోడు ఉప ఎన్నికల నేపధ్యంలో భాజపా జాతీయ కార్యదర్శి, ఆ పార్టీ తెలంగాణ ఇన్ చార్జ్ సునీల్ బన్సల్ హైదరాబాదుకు చేరుకొన్నారు. ఆ పార్టీ నేతలతో సమావేశమైనారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కోర్ కమిటీ సమావేశంలో బన్సల్ పలు అంశాలను కీలక నేతల ముందుంచారు.
మునుగోడు ఉప ఎన్నికతో పాటు హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు, ప్రజా గోస, భాజపా భరోసా, పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమాలపై నేతలతో చర్చించారు. పేదలకు అందిస్తున్న కేంద్ర పధకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, అధికార ప్రభుత్వం టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టాలని బన్సల్ కీలక నేతలకు దిశా నిర్ధేశం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక గెలుపుపై పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి తెరాస నకిలీ ఓట్లు నమోదు చేయిస్తుందని బన్సల్ దృష్టికి తీసుకొచ్చారు. మునుగోడులోని 189గ్రామల్లో బైక్ యాత్రలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఓటర్ల జాబితాను పరిశీలించాలని నిర్ణయించిన్నట్లు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి:TDP: తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్