Prime9

Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో అధికార బీజేపీ, కాంగ్రెస్‌లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది, అవసరమైన మెజారిటీ మార్క్‌ను తాకింది. అధికారాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తున్న బీజేపీ ఇప్పటి వరకు 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.హిమాచల్ ప్రదేశ్‌లో గత నాలుగు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమూ తిరిగి అధికారంలోకి రాలేదు.

అయితే ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు ఇక్కడ బీజేపీ అధికారాన్ని నిలబెట్ఠుకుంటుందని అంచనా వేసిన విషయం తెలిసిందే. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తాము విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేసింది, ధరల పెరుగుదల, నిరుద్యోగం, పాత పెన్షన్ స్కీమ్ మరియు ఇతర సవాళ్లపై ఓటర్లు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. బీజేపీ మెజారిటీకి అవసరమైన సీట్లను గెలుచుకోవడంలో విఫలమయితే తమపార్టీ ఎమ్మెల్యేలను ఛత్తీస్‌గఢ్‌కు షిప్ట్ చేస్తామని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

2019 సార్వత్రిక ఎన్నికలలో, హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ 61 శాతం ఓట్లు సాధించింది. ఇది మొత్తం దేశంలోనే అత్యధికం. నేటి ఉదయం 10.30 గంటల సమయానికి బీజేపీ, కాంగ్రెస్‌లకు కేవలం 43 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.

 

Exit mobile version
Skip to toolbar