Site icon Prime9

Naga Manikanta: లైవ్‌లో విగ్గు తీసేసిన మణికంఠ – ఎలా ఉన్నాడో చూశారా?

Bigg Boss 8 Telugu Naga Manikanta: బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి బయటకు వచ్చాక నాగ మణికంఠ ప్రస్తుతం వరుస ఇంటర్య్వూలో బిజీ అయిపోయాడు. టైటిల్‌ గెలిచే హౌజ్‌ నుంచి వెళతానని, చివరి వరకు తన ఎఫర్ట్స్‌ పెడతానని చెప్పిన మణికంఠ ఏడోవారంలోనే బయటకు వచ్చాడు. నామినేషన్‌లో ఉన్న మణికంఠ సేవ్‌ అయినప్పటికీ తనకు తానే సొంతంగా హౌజ్‌ను విడాడు. దీంతో మణికంఠ హాట్‌టాపిక్‌ అయ్యాడు. లోపలికి అడుగుపెట్టగానే సింపతి కోసం చూశాడు. ఎవరితో ఇమడలేనంటూ హౌజ్‌లో తనని తాను అసోలేట్‌ చేసుకున్నాడు. తరచూ తన కష్టాలు, పడిన బాధలు ఇవంటూ కన్నీరు పెట్టుకునేవాడు.

ఆట కంటే కూడా ఇతర కంటెస్టెంట్స్‌ తనని ఏమనుకుంటున్నారు, తన గురించి ఏం మాట్లాడుకుంటున్నారో అనే వాటిపైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. తరచూ బార్య, కూతురిని తలచుకుంటూ కన్నీరు పెట్టుకున్నాడు. అలా రెండు వారాలు గడిపిన మణికంఠ మూడో వారం నుంచి తన ఆటతో సత్తా చూపాడు. టాస్క్‌ల్లో చెలరేగిపోయాడు. అందరికి గట్టి పోటీ ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా మణికంఠకు ఫ్యాన్‌ ఫాలోయింగ్ పెరిగిపోయింది. కానీ హౌజ్‌లో తన తీరుతో కంటెస్టెంట్స్‌ దృష్టిలో నెగిటివ్‌ అయ్యాడు. మనుషులlను బట్టి తన ప్రవర్తన ఉందని, ఒకరి ముందు ఒకలా ఉన్నాడంటూ అతడిపై వ్యతిరేకత చూపారు.

ఇక ఐదో వారంలో వచ్చిన వైల్డ్‌ కార్డ్స్‌ సభ్యులు మాత్రం మణికంఠకు సపోర్టుగా నిలిచారు. వాళ్లు వచ్చాక కాస్తా ధైర్యంగా ఫీల్‌ అయిన మణికంఠ ఎందుకో కానీ, తాను హౌజ్‌లో ఉండేలేనని.. ఫిజికల్‌గా,మెంటల్‌గా వీక్‌ అయ్యానంటూ తన సొంత నిర్ణయం మీద బయటకు వచ్చాడు. ఇలా బయటకు వచ్చిన అతడు తాజాగా ఓ యూట్యూబ్‌ చానల్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా హౌజ్‌ని వీడాలన్న తన నిర్ణయానికి కారణాలు వెల్లడించాడు.

ఎందుకలా బయటకు వచ్చారని యాంకర్‌ ప్రశ్నించగా.. బిగ్‌బాస్ ద్వారా నేను డబ్బు, గౌరవం సంపాదించాలనుకున్నా. కానీ ఫిజికల్‌ టాస్క్‌లు ఆడటానికి నా శరీరాం సహకరించడం లేదు. చాలా వీక్‌ అయ్యాను. ఆటలు ఆడి కాళ్లు చేతులు విరగొట్టుకోవాలనుకోలేదు. అందుకే బయటకు రావాలనుకున్నా. పైగా అక్కడ నేను ఏం మాట్లాడిన, ఏం చేసినా తప్పు అన్నట్టుగా చూస్తున్నారు. అది నా వల్ల కాలేదు. కానీ బిగ్‌బాస్‌ వల్ల జీవితంలో ఎలా బ్రతకాలో నేర్చుకున్నా” అని చెప్పుకొచ్చాడు. అనంతరం యాంకర్‌ మాట్లాడుతూ.. రియల్‌ మణికంఠను ఇంటర్య్వూ చేయాలనుకుంటున్నాని, విగ్‌ తీయాలని అడిగాడు. ఇందుకు మణికంఠ తప్పుకుండా.. అంటూ లైవ్‌లోనే విగ్‌ తీసేశాడు. అంతేకాదు విగ్‌ లేకుండా మిగతా ఇంటర్య్వూ కంటిన్యూ చేశాడు.

Exit mobile version
Skip to toolbar