Site icon Prime9

AP Bar Policy: ఏపీలో బార్ లైసెన్సుల కోసం బిడ్డింగ్ ప్రారంభం

Andhra Pradesh: బార్ పాలసీలో భాగంగా ఏపీలో బార్ లైసెన్సుల కోసం బిడ్డింగ్ ప్రారంభం అయ్యింది. జోన్ల వారీగా బార్ లైసెన్సులకు బిడ్డింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. ఇవాళ ఉదయం 10గంటల నుంచి ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్ లైన్ ఎన్రోల్మెంట్ చేసుకోనుంది ఏపీ ప్రభుత్వం.

నాన్ రిఫండ్ అప్లికేషన్ ఫీజు చెల్లించేందుకు ఈ నెల 28వ తేదీ సాయంత్రం వరకు గడువు విధించారు. 28, 29వ తేదీల్లో అప్లికేషన్ల స్క్రూటీని పరిశీలిస్తారు. జోన్-1 పరిధిలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు ఈ నెల 30వ తేదీన బిడ్డింగ్ జరగనుంది. ఇక జోన్-4 పరిధిలోని తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, సత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాలకూ కూడా ఈ నెల 30వ తేదీనే బిడ్డింగ్ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

జోన్-2 పరిధిలోని కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలతో పాటు జోన్-3 పరిధిలోని గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఈ నెల 31వ తేదీన బిడ్డింగ్ నిర్వహించనున్నారు. 30, 31 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు బిడ్డింగ్ కొనసాగనుంది. అదే రోజు మధ్యాహ్నాం 3 గంటల నుంచి 5 గంటల వరకు రీ-బిడ్డింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు అధికారులు.

Exit mobile version