Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర 18వ రోజుకు చేరింది. ఈ నెల 10న కేరళలో ప్రవేశించిన రాహుల్ పాద యాత్ర నేడు వాయనాడ్ నియోజకవర్గంలో ప్రవేశించింది. కేరళలో రాహుల్ పాదయాత్ర 450 కి.మీమేర సాగనుంది. అక్టోబర్ 1న జోడో యాత్ర కర్ణాటకలో ప్రవేశిస్తుంది. వందలాది మంది పార్టీ కార్యకర్తలు, ఆయా ప్రాంతాల ప్రజలు రాహుల్ కు జతకడుతూ జోడో యాత్రలో హుషారుగా పాల్గొంటున్నారు. రాహుల్ గాంధీ కూడా ఎక్కడి సమస్యలు అక్కడ వింటూ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. మరో వైపు రాహుల్ లో చర్చిస్తున్న సమస్యలు, వాటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ తమ డైరీలో వ్రాసుకొంటూ తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఓ అంచనాకు వస్తున్నారు.
సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారిలో ప్రారంభమైన రాహుల్ భారత్ జోడో యాత్ర 150 రోజుల పాటు సాగనుంది. 3570కి.మీ మేర సాగుతూ కాశ్మీర్ లో పాదయాత్రను రాహుల్ ముగిస్తారు. ఇప్పటికే జోడో యాత్రకు ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుండండతో ఏఐసిసి వర్గాల్లో ఆనందాన్ని నింపింది. మరో వైపు రాహుల్ కూడా ఎప్పటికప్పుడు ప్రజా వ్యతిరేకమైన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను విభేదిస్తూ వస్తున్నారు.
2024లో కేంద్రంలో అధికారంలోకి రావడమే ప్రధానంగా రాహుల్ భారత్ జోడో యాత్రను తలపెట్టారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి లభించిన ప్రజాధరణతో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి కూడా భారీ ఏర్పాట్లను చేస్తూ పాదయాత్ర విజయానికి కీలక నేతలు, కార్యకర్తలు శ్రమిస్తున్నారు.
ఇది కూడ చదవండి: Hyderabad Cable Bridge: చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన యువతి