Site icon Prime9

Benefits of Broccoli: బ్రోకలీతో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కుతుందా?

Benefits of Broccoli

Benefits of Broccoli

Benefits of Broccoli: చాలా మంది తమ డైట్ లో బ్రోకలీ ఉండేలా చూసుకుంటారు. అయితే కొంతమంది అసలు బ్రోకలీ అంటే ఏమిటో తెలియదు. దాని వల్ల కలిగే ప్రయోజనాలు కూడా తెలియవు. అయితే రోజూ వారి ఆహారంలో బ్రోకలీని చేర్చడం వల్ల ఆరోగ్యానికి మంచిందని.. జీవన నాణ్యతను మెరుగుపడుతుందని ఓ కొత్త అధ్యయనం పేర్కొంది. అంతే కాదు ఇది రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గిస్తుందని కూడా వెల్లడించింది.

బ్రోకలీ, క్యాలీఫ్లవర్, క్యాబేజీ లేదా కాలే వంటి క్రూసిఫెరస్ కూరగాయలను ఎక్కువగా ఆహారంలో తీసుకునే మహిళలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువని గతంలో జరిగిన అనేక అధ్యయనాలు పేర్కొన్నాయి. అలాంటి ఆహారాల్లో అత్యధిక స్థాయిలో కనిపించే సల్ఫోరాఫేన్, క్యాన్సర్ కారకాలు వివిధ విధానాల ద్వారా రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని మాడ్యులేట్ చేయగలదని పరిశోధనలో తేలింది. మరీ ముఖ్యంగా సల్ఫోరాఫేన్ హిస్టోన్ డీసిటైలేస్‌లను నిరోధిస్తుంది.

Alkaline Diet for Cancer | Moffitt

 

కొలెస్ట్రాల్‌ తగ్గించడంలో(Benefits of Broccoli)

అదే విధంగా కొలెస్ట్రాల్‌ను తగ్గించడం నుంచి బరువు తగ్గేందుకు బ్రోకలీతో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు నిపుణలు. బ్రోకలీ మంచి పోషకాలు ఉండే ఆకు పచ్చని కూరగా చెప్పవచ్చు.

బ్రోకలీలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు సి, కె, ఎ, ఫోలేట్, పొటాషియం, ఫైబర్​కు బ్రోకలీలో ఎక్కువగా ఉంటాయి. ఈ పోషకాలు ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు, ఎముకలు బలపడటానికి, చర్మాని, జీర్ణక్రియను నియంత్రించడంలో సహాయపడతాయి.

 

4 Health Benefits of Broccoli

 

బ్రకోలీలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ కూరగాయలలో ఫ్లేవనాయిడ్స్, సల్ఫోరాఫేన్ అనే సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. క్యాన్సర్, గుండె జబ్బులు లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీసే ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి కణాలను రక్షించడంలో ఈ సమ్మేళనాలు సహాయపడతాయి.

 

కాల్షియం స్థాయిలు ఎక్కువే

ఒక కప్పు బ్రోకలీలో తీసుకుంటే 87 mg కాల్షియం లభిస్తుంది. బ్రోకలీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మూత్రాశయం, రొమ్ము, పెద్దప్రేగు, కాలేయం మరియు కడుపు క్యాన్సర్లను నివారించడంలో అది సహాయపడుతుంది.

బ్రోకలీ ని పచ్చి గా తినటం వల్ల ఎలాంటి గుండె జబ్బులు, క్యాన్సర్, దీర్ఘకాలిక వ్యాధులు దరి చేరకుండా రక్షిస్తుంది. అంతే కాకుండా ఈ బ్రోకలీ ని తినటం వల్ల ఎముకలు ఎప్పటికీ కూడా బలంగా ఉంటాయి మరియు చర్మం యవ్వనంగా కాంతి వంతంగా ఉంటుంది. మిగితా కూరగాయలతో పాటు బ్రొకోలి ని కూడా రోజూ వారి ఆహారంగా తిసుకోవాలి.

 

Exit mobile version
Skip to toolbar