Chatrapathi Movie : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో “బెల్లంకొండ సాయి శ్రీనివాస్” కూడా ఒకరు. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకుగా.. సాయి శ్రీనివాస్ సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటు వంటి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ.. అల్లుడు శీను సినిమాలో తన నటనతో ప్రతిభను నిరూపించుకున్నారు. దీంతో వరుస సినిమాల్లో అవకాశాలు దక్కినప్పటికీ కథల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో ఈ మధ్య ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్తరు మార్కెట్ ఉన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి హిందీలో మాత్రం స్టార్ హీరో రేంజ్ మార్కెట్ ఉంది. సాయి శ్రీనివాస్ డబ్బింగ్ సినిమాలకి హిందీలో మిలియన్ల వ్యూస్ వస్తుంటాయి. అతను ఏ సినిమా రిలీజ్ చేసిన అది హిందీలో డబ్ అవ్వాల్సిందే.. దానికి లక్షల్లో వ్యూస్ రావాల్సిందే.. అన్నట్టు ట్రెండ్ సృష్టిస్తున్నాయి.
ప్రభాస్ ఛత్రపతి సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలోకి అడుగుపెడుతున్నాడని అందరికీ తెలిసిందే. కాగా 18ఏళ్ల కిందట టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన ‘ఛత్రపతి’ ఇప్పుడు హిందీలో రిమేక్ అవుతుండడంతో సినీ ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మూవీని వేసవి కానుకగా మే 12న ప్రేక్షకుల ముందు తీసుకురానున్నట్టు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. పెన్ స్టూడియోస్ బ్యానర్ పై జయంతి లాల్ నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేయకముందే దసరా మూవీ సందర్భంగా థియేటర్లలో ప్లే చేసిన యాడ్ స్పేస్ లో ప్లే చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది.
ఈ టీజర్ గమనిస్తే.. ‘ఛత్రపతి’ (Chatrapathi Movie) కోసం బెల్లంకొండ తన శరీరాకృతిని పూర్తిగా మార్చేశారు. తెలుగులో ప్రభాస్ ఏ విధంగా అయితే కండలతో, ఫిట్ గా కనిపించాడో అదే తరహాలో పూర్తిగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యాడు. మనచ్చి యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ ఉండబోతుందని తెలుస్తుంది. రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఇంట్రస్టింగ్ పాయింట్ ఏంటీ అంటే హీరోయిన్ ఎవరన్న దానిపై మేకర్స్ ఇంకా ప్రకటించకపోవడం. ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్, టీజర్ లోనూ హీరోయిన్ ని చూపించలేదు.
700 మిలియన్ వ్యూస్ సాధించిన జయ జానకి నాయక..
అయితే ప్రొఫెషనల్ గా, పర్సనల్ గా కూడా సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా, ఎలాంటి గొడవలకి, కాంట్రవర్సీలకీ పోకుండా సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతుంటాడు సాయి శ్రీనివాస్. 2019 ఫిబ్రవరి 8న హిందీలో జయ జానకి నాయక ‘ఖూన్కార్’ అనే టైటిల్ తో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పటివరకూ రికార్డ్ స్థాయిలో 700 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఏ భాషలో అయినా ఒక సినిమా 700 మిలియన్ వ్యూస్ రాబట్టడం ఇదే మొదటిసారి కావడం విశేషం అని చెప్పాలి.
#JayaJanakiNayakaKhoonkhar has cemented its place in history by breaking a monumental milestone with over 700 million views on YouTube. 💥💥💥
It is the FIRST FILM ever to acheive this mark!! ❤️🔥@BSaiSreenivas @Rakulpreet @jayantilalgada pic.twitter.com/dhHo4G6y5w
— PEN INDIA LTD. (@PenMovies) March 29, 2023