BCCI: ఇండియన్ క్రికెట్ టీమ్ చార్టర్డ్ ఫ్లైట్ కు బీసీసీఐ పెట్టిన ఖర్చు రూ.3.5 కోట్లు

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ సంస్థ అన్నవిషయం అందరికీ తెలిసిందే. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ముగిసిన అనంతరం భారత జట్టు నేరుగా కరీబియన్‌ దీవులకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌తో అఖరి వన్డే ముగిశాక 16 మంది ఆటగాళ్లతో కూడిన భారత బృందం ప్రత్యేక విమానంలో మాంచెస్టర్

  • Written By:
  • Publish Date - July 21, 2022 / 08:10 PM IST

BCCI: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ సంస్థ అన్నవిషయం అందరికీ తెలిసిందే. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ముగిసిన అనంతరం భారత జట్టు నేరుగా కరీబియన్‌ దీవులకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌తో ఆఖరి వన్డే ముగిశాక 16 మంది ఆటగాళ్లతో కూడిన భారత బృందం ప్రత్యేక విమానంలో మాంచెస్టర్ నుంచి పోర్ట్ ఆఫ్ స్పెయిన్(ట్రినిడాడ్‌) చేరుకుంది. అయితే ఇంగ్లండ్‌ నుంచి విండీస్‌కు. భారత ఆటగాళ్లు వెళ్లిన చార్టర్డ్ ఫ్లైట్‌కు బీసీసీఐ ఏకంగా రూ.3.5 కోట్ల భారీ మొత్తాన్ని ఖర్చు పెట్టింది

అయితే దీనిపై బిసిసిఐ అధికారి ఈ విధంగా వివరణ ఇచ్చారు. జట్టు కోసం చార్టర్డ్ ఫ్లైట్ బుక్ చేయడానికి కారణం కోవిడ్ -19 కాదు, వాణిజ్య విమానంలో ఇన్ని టిక్కెట్లు బుక్ చేయడం కష్టం- భారత బృందంలో ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో సహా 16 మంది ఆటగాళ్లు మరియు సహాయక సిబ్బంది సభ్యులు ఉన్నారు. ఆటగాళ్ల భార్యలు కూడా ఉన్నారు.

సాధారణంగా కమర్షియల్ ఫ్లైట్‌ ఖర్చు దాదాపు రూ. 2 కోట్లు మాత్రమే అయి ఉండేది. అయితే చార్టర్డ్ ఫ్లైట్ కోసం అదనంగా మరో 1.5 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని అధికారి తెలిపారు.