Taraka Ratna: యువగళం యాత్రలో అస్వస్థతకు గురైన నందమూరి తారకరత్న ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.
తారక రత్న ఆరోగ్యం గురించి.. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నారంటే?
ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని నందమూరి బాలకృష్ణ వెల్లడించారు.
ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌తో కలిసి బాలకృష్ణ ఆదివారం పరామర్శించారు.
బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రి ముందు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
అనంతరం బాలకృష్ణ, శివరాజ్‌కుమార్ మీడియాతో మాట్లాడారు.
బాలకృష్ణ మాట్లాడుతూ..
తారకరత్న విషయంలో మిరాకిల్ జరిగిందని బాలకృష్ణ తెలిపారు. తొలుత తారకరత్న(Taraka Ratna) హార్ట్ బీట్ ఆగిపోయిందని, కాసేపటి తర్వాత తిరిగి మొదలైందని వివరించారు.
తారకరత్నను పరామర్శించేందుకు వచ్చినందుకు శివరాజ్‌కుమార్‌కు బాలకృష్ణ ధన్యవాదాలు తెలిపారు.
పీఈఎస్ ఆస్పత్రి వైద్యులు మంచి చికిత్స అందించారని.. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం నారాయణ హృదయాలయకు తీసుకురావడం జరిగిందని బాలకృష్ణ తెలిపారు.
కుప్పంలో ఉన్నప్పుడు ఎలాగా ఉందో ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు కూడా అలాగే ఉందన్నారు.
అయితే ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని.. క్షీణించడం లేదని చెప్పారు.
ఇంప్రూవ్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నట్టుగా తెలిపారు. వైద్యులు అన్ని రకాలుగా కేర్ తీసుకుంటున్నారని చెప్పారు.
అయితే స్టంట్ వేయడం కుదరలేదని.. మళ్లీ అటాక్ వచ్చే అవకాశం ఉన్నందున డాక్టర్లు అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పారు.
చికిత్సకు కొంతవరకు తారకరత్న స్పందిస్తున్నారని తెలిపారు. ఒకసారి గిచ్చితే కొద్దిగా స్పందించారని అన్నారు. అభిమానుల దీవెనలు, ప్రార్థనలతో త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నామని తెలిపారు.
ప్రముఖ సినీ నటుడు తారకరత్నకు మెరుగైన వైద్యం అందుతుందని ఆయన సోదరుడు, ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు.
ఆయన కూడా పోరాడుతున్నారని చెప్పారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న తారకరత్నను ఆదివారం జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు పరామర్శించారు.
వారితో పాటు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ కూడా ఆస్పత్రికి చేరుకుని తారకరత్న ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు.
జూనియర్ ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ..
27వ తేదీన దురదృష్టకరమైన ఘటన చోటుచేసుకుందని అన్నారు.
తన అన్న తారకరత్నకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని చెప్పారు. ఆయనకు అభిమానుల ఆశీర్వాదం, తాత ఆశీర్వాదం ఉందన్నారు.
ఆయన త్వరగా కోలుకోవాలని దేవున్ని కోరుకుంటున్నట్టుగా చెప్పారు. అందరూ ప్రార్థనలు కొనసాగించాలని, అభిమానుల ఆశీర్వాదం ఎంతో ముఖ్యమని చెప్పారు.
కర్ణాటక హెల్త్ మినిస్టర్, తనకు ఆప్తులైన సుధాకర్‌కు ధన్యవాదాలు చెబుతున్నట్టుగా తెలిపారు.
ఆయన కూడా ఈ పరిస్థితుల్లో తన వంతు సాయం అందిస్తున్నారని చెప్పారు. తాను తారకరత్నను చూశానని.. ఆయన స్పందిస్తున్నారని.. మంచి వైద్యం అందుతుందని తెలిపారు.
మరో ఇద్దరు వైద్యులను కూడా ఇక్కడికి రప్పించడం జరుగుతుందని అన్నారు.
ప్రస్తుతం ఆయన నిలకడగా ఉన్నారు.. అలాగానీ క్రిటికల్ కండీషన్ నుంచి బయటకు వచ్చినట్టుగా కాదన్నారు.
అయితే చికిత్సకు స్పందిస్తున్నారని.. ఇది మంచి పరిణామని తెలిపారు. ఎక్మో సాయంలో తారకరత్న లేరని అన్నారు.
కుటుంబ సభ్యునిగా తాను ఇక్కడకు వచ్చానని తెలిపారు. డాక్టర్లు తనకు ధైర్యం ఇచ్చారని.. అదే ధైర్యాన్ని తాను అభిమానులకు చెబుతున్నానని అన్నారు.
నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ..
అందరి అభిమానంతో.. తమ్ముడు తారకరత్న తొందరగా కోలుకుని మన అందరి ముందుకు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు.
శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ..
తారకరత్న చికత్సకు స్పందిస్తున్నారని తెలిపారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టుగా చెప్పారు.
తారకరత్న కోసం అందరూ ప్రార్థిస్తున్నారని చెప్పారు. అభిమానుల దీవెనలతో తారకరత్న త్వరలోనే కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/