Site icon Prime9

Bairi Naresh: పరారీలో భైరి నరేష్.. రాములపల్లిలో ఇంటికి తాళం

Bairi naresh complete story

Bairi naresh complete story

Bairi Naresh: ఇటీవల కొడంగల్‌ వేదికగా జరిగిన అంబేద్కర్‌ సభలో భారత నాస్తిక సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భైరి నరేష్‌ హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దానితో ఆయనపై వికారాబాద్ జిల్లాలో కేసు నమోదు అయింది. కాగా గత మూడు రోజులుగా నరేష్ పోలీసులకు తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో పోలీసులు నాలుగు టీంలను ఏర్పాటు చేసి నరేష్ కోసం గాలింపు చేపట్టారు. అయితే హనుమకొండ జిల్లా కమాలపూర్ మండలం కన్నూరు గ్రామపంచాయతీ పరిధిలోని రాములపల్లి నరేష్ సొంతూరు. నరేష్ హిందూదేవుల్లపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఇంటికి తాళం వేసి భార్య, పిల్లలు సహా కుటుంబ సభ్యులంతా పరారీలో ఉన్నారు. ఇకపోతే బైరి నరేష్ కోసం ఇంటి దగ్గర పోలీసుల పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.

Bairi naresh’s family locked the house and left

నరేష్‌పై 153A, 295A, 298, 505 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమంటూ వికారాబాద్ ఎస్పీ హెచ్చరించారు. హిందూ దేవుళ్లను అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్‌ను కఠినంగా శిక్షించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా  అయ్యప్పస్వాములు, వీహెచ్‌పీ, భజరంగ్‌దల్‌, బీజేపీ నేతలు ఆందోళనలు చేపడుతున్నారు.

Exit mobile version