Site icon Prime9

Azadi ka amrit mahotsav: తెలంగాణలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు

CM KCR Letter

CM KCR Letter

Hyderabad: దేశభక్తి, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి ప్రజలందరిలో రగిలేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. విద్యార్థులు, ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, యువతీ యువకులు సహా యావత్‌ తెలంగాణ సమాజం ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. వజ్రోత్సవాల సందర్భంగా ఈ నెల 21న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని, అదేరోజు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జడ్పీలు, నగర, పురపాలికల్లో ప్రత్యేక సమావేశాలుంటాయని వెల్లడించారు.

ఉత్తమ గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, పాఠశాల, రైతు, వైద్యుడు, ఇంజినీర్‌, పోలీస్‌ అధికారి, కళాకారుడు, గాయకుడు, కవి తదితరులను గుర్తించి సత్కరిస్తామని వివరించారు. రాష్ట్రంలో మొత్తం 1.20 కోట్ల గృహాలపై ఎగురవేసేందుకు జాతీయ జెండాలను ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు. ఆగస్టు 8 నుంచి 22 వరకు నిర్వహించనున్న వజ్రోత్సవ ద్విసప్తాహం కార్యక్రమాలపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వజ్రోత్సవాల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ కేశవరావు సహా 24 మంది సభ్యులు, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్‌, సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, సీఎస్‌, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Exit mobile version